‘కేరాఫ్ కంచెరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా టాలీవుడ్ స్టార్ హీరోల పై చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. ఇటీవల అతను మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలో..”టాలీవుడ్ స్టార్ హీరోలు.. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇవ్వరు. అసలు చాలా మంది స్టార్ హీరోలకి స్టోరీని జడ్జ్ చెయ్యడం రాదు. కొత్త రకమైన కథలని అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం కూడా లేవు. ‘ఆకలి అంటే ఏమిటో’ ‘ఆకలితో ఉండటం అంటే ఏమిటో’ వారు అర్ధం చేసుకోలేరు. స్టార్ హీరోలు.. కొత్త దర్శకులకు ఛాన్స్ లు ఇవ్వము అని నిజాయితీగా చెప్పలేక.. సాకులు చెప్పి తప్పించుకుంటారు.
ఆ ట్యాలెంట్ వారికి మాత్రమే సొంతం” అంటూ దర్శకుడు వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సత్యదేవ్ తో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ కుర్ర డైరెక్టర్ అసలు ఈ కామెంట్స్ ఎందుకు చేసాడు అనే విషయాన్ని పక్కన పెడితే.. టాలీవుడ్ లో స్టార్ హీరోలు కొత్త దర్శకులతో పనిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అయితే కెరీర్ ప్రారంభంలో ‘తొలిప్రేమ’ ‘తమ్ముడు’ వంటి సినిమాలతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు కొత్త దర్శకులతోనే చేసాడు. మహేష్ బాబు ‘బాబీ’ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేసి చేతులు కాల్చుకున్నాడు.
ఇక ఎన్టీఆర్ అయితే రాజమౌళి, వినాయక్, వర ముళ్ళపూడి వంటి దర్శకులకు మొదటి ఛాన్స్ ఇచ్చాడు. నాగార్జున, రవితేజ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఇంకా కొత్త దర్శకులను పరిచయం చేస్తూనే ఉన్నారు. అయితే స్టార్ హీరోలైన ప్రతీఒక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు కాబట్టి.. ఆచి తూచి సినిమాలు చెయ్యాలి. లేదంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.. తీవ్రంగా నష్టపోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి స్టార్ హీరోలను కూడా తప్పు పట్టడం సరికాదనే చెప్పాలి.
Most Recommended Video
మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!