3 ప్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఏడాది కష్టపడి ‘భీష్మ’ చిత్రం చేసాడు. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించింది కూడా..! ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ప్రతీ బయ్యర్ లాభాల బాట పట్టారు. అయితే మొదటి నుండీ ఈ చిత్రం టైటిల్ పై అభ్యంతరాలు తెలుపుతూ.. గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ అండ్ టీం నిరసనకు దిగారట. అలా అని సినిమా ఏమీ వాయిదా పడలేదు. ప్రొడ్యూసర్స్ హ్యాపీ.. సినిమా లాభాలను అందించింది కాబట్టి.. డిస్ట్రిబ్యూటర్లు కూడా హ్యాపీ.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా హ్యాపీ..! అయితే ఇప్పుడు ఈ చిత్రం పై కేసు నమోదయ్యింది.
గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ ఇటీవల మానవ హక్కుల కమిషన్‌కు ‘భీష్మ’ చిత్రం యూనిట్ పై కంప్లైంట్ చేశారు. ఈ చిత్రంలో కొన్ని అభ్యంతకరమైన సీన్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారట. అయితే ‘భీష్మ’ చిత్రాన్ని ఇప్పుడు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందులోనూ ఎగ్జామ్స్ టైం.. మరోపక్క కరోనా వైరస్ భయం వల్ల కూడా జనాలు థియేటర్లకు రావడం లేదు. అలాంటప్పుడు ఈ చిత్రం పై కేసు వేసి ఉపయోగం ఏంటో వాళ్ళకే తెలియాలి..! అయితే అభ్యంతరకరమైన సీన్లు ఏంటి అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరందుకుంది.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!