Samantha Song: సమంత ఐటెమ్ సాంగ్ పై కేసు నమోదు!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’ ఆగస్టు 17న ప్రపంచవ్యాప్తంగా పుష్ప’ విడుదల కానుంది. సినిమాలో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఇక సునీల్ ఫహద్ ఫాసిల్ పవర్ఫుల్ విలన్స్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాపై ఇంతవరకు ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ కాలేదు. కానీ మొదటిసారి సమంత ఐటెమ్ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కోర్టుకు ఎక్కారు.

సమంత తన కెరీర్ లోనే తొలిసారిగా ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన “ఊ అంటావా ఊ ఊ అంటావా” పాట లిరికల్ వీడియో డిసెంబర్ 10న అన్ని భాషల్లో ఒకేసారి విడుదలైంది. అయితే ఐటెం సాంగ్‌పై వెంటనే నిషేధం విధించాలని కోరుతూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాలోని పురుషుల కోసం ఓ సంస్థ కేసు వేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలోని లిరిక్స్ పురుషులు ఎల్లప్పుడూ కూడా

వికృతమైన మనస్సు కలిగి ఉంటారని వర్ణించారని అలాగే వారు సెక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లుగా హైలెట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీలైనంత తొందరగా పాటను నిషేధించాలని సదరు సంస్థ పురుషుల కోసం మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన అనేక రకాల మీమ్స్ వచ్చాయి. పురుషులను ఏమైనా అంటే అడిగేవారు ఒక్కరు కూడా ఉండరని చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

మరి ఈ కేసు ఎంతవరకు ఫోకస్ అవుతుందో చూడాలి. ఇక పుష్ప సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అనసూయ కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరి బాక్సాఫీస్ వద్ద పుష్ప ఎలాంటి ఓపెనింగ్స్ ఎందుకుంటుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus