రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పై కేసు నమోదైంది. ఆ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకూడదు అంటూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవ్వడం సంచలనంగా మారింది. ఈ చిత్రం కథ ఎరుకుల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉంది అంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. స్టూవర్టుపురానికి చెందిన పాల్ రాజ్ అనే వ్యక్తి ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల కాకుండా ఆపాలి అంటూ ఈ వేయడం జరిగింది.
“మా మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రీకరించిన సినిమాలను దయచేసి విడుదల చేయకండి. పాత తరం నేరస్థుల జీవన విధానాన్ని భూతద్దంలో చూపిస్తూ మా గ్రామాన్ని క్రైమ్ క్యాపిటల్గా చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా చదువుకుని హుందాగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాలు విడుదలైతే మా గ్రామం పై ప్రభావం చూపుతుంది. దయచేసి మా ఊరిని గజదొంగల ఊరుగా చూపించడం మానుకోండి.
వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్న ఒకరిద్దరు మినహాయించి తమ గ్రామంలో ఆనాటి తరం గజదొంగలు ఎవ్వరూ లేరు” అంటూ అతను ఆ ఫిల్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. హైకోర్టు ఈ పిల్ ను రెండు వారాల పాటు వాయిదా వేసినట్టు ప్రకటించారని సమాచారం. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్లింప్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగులో గ్లింప్స్ కు వెంకటేష్, తమిళ్ గ్లింప్స్ కు కార్తీ, హిందీ గ్లింప్స్ కు జాన్ అబ్రహం, కన్నడ గ్లింప్స్ కు శివరాజ్ కుమార్, మలయాళం గ్లింప్స్ కు దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది.