‘కబాలి’ నిర్మాత వల్ల చిక్కుల్లో పడ్డ హీరోయిన్లు!

మాదక ద్రవ్యాల విక్రయం కేసు విషయంలో ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత అయిన కృష్ణ ప్రసాద్‌ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సైబరాబాద్‌ పోలీసులు.. తెలపడం జరిగింది. నిందితుడు కొకైన్‌ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు స్పష్టమవుతుంది. కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా వారు తెలిపినట్టు సమాచారం. కృష్ణ ప్రసాద్‌ చౌదరిది ఖమ్మం జిల్లా బోనకల్‌. బీటెక్‌ చదివి పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన ఆయన..2016 లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

రజనీకాంత్‌ హీరోగా పా రంజిత్ దర్శకత్వరలో తెరకెక్కిన ‘కబాలి’ సితెలుగు వర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణప్రసాద్‌ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ వ్యవహరించారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్‌ సురవరం తదితర చిత్రాలను ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గోవాలో ఓహెచ్‌ఎం పబ్‌ను ఆయన ప్రారంభించడం జరిగింది. ఇదిలా ఉండగా.. కృష్ణప్రసాద్‌ ను విచారించిన పోలీసులు కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అతని నాలుగు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల డేటాలను పోలీసులు తనికీ చేయగా అతనితో సన్నిహితంగా ఉంటున్న సినీ ప్రముఖుల విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది.

ఇక అతని ఫోన్లలో ఉన్న డేటా ప్రకారం.. ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇతని వద్ద నుండి డ్రగ్స్ పొందుతున్నట్టు తేలింది. దీంతో ఇప్పుడు మరిన్ని కఠినమైన పరిస్థితులు ఏర్పడినట్టైంది. అసలే డ్రగ్స్ విషయంలో పూరి, ఛార్మి వంటి వారు ఎంతో మందికి విచారణల మీద మీద విచారణలు జరిగాయి. విజయ్ దేవరకొండ ని కూడా విచారించారు. ఇప్పుడు ఈ ‘కబాలి’ నిర్మాత వల్ల మరోసారి టాలీవుడ్ పెద్దలు చిక్కుల్లో పడినట్టు అయ్యింది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags