టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అసలైన స్టామినా చూపించాడు. గత శుక్రవారం విడుదలైన భీమ్లా నాయక్ సినిమా ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ వచ్చాయి. ఇక ఫైనల్ గా విడుదల రోజే మొదటి నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకుంటూ వచ్చింది.
వకీల్ సాబ్ అనంతరం పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా పై బయట నుంచి ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వలేదు. కానీ మొదటిసారి పోలీస్ కేసు నమోదు కావడం విశేషం. తమ మనోభావాలను కించ పరిచారు అని కొందరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
క్లైమాక్స్ లో రానా దగ్గుపాటి పవన్ కళ్యాణ్ కు మధ్యలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అయిన విషయం తెలిసిందే. అయితే అందులో రానా దగ్గుబాటి కుండలు తయారు చేసే చక్రంని కాలితో తన్నడంపై తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన ఆంద్రప్రదేశ్ చైర్మన్ ఎం పురుషోత్తంకు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. రానా దగ్గుబాటి సినిమాలో తాము ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నడం కుమారులను కించపరిచేలా ఉంది అని ఆ సన్నివేశాన్ని సినిమాలో నుంచి తొలగించాలని కూడా వారు డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు ఈ కేసుపై చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యమీనన్ నటించగా సీతారా ఎంటర్టైన్మెంట్ లో యువ నిర్మాత నాగ వంశీ సినిమాను నిర్మించారు.