భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల ప్రజలు సంతోషించారు. బ్లాక్ మనీ ని అరికట్టేందుకు 500, 1000 కరెన్సీ బ్యాన్ చేయడాన్ని గొప్ప పనిగా అభినందించారు. ఈ ఆనందాన్ని టాలీవుడ్ సెలిబ్రిటీలు ట్వీట్ల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అవి ఏమిటంటే..
అందనంత ఎత్తు
గొప్ప సంస్కరణ (హైట్స్ ఆఫ్ మోడిఫికేషన్). – అల్లు అర్జున్
జోహార్లు
మోడీ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్. బ్లాక్ మనీ కలిగిఉన్న వారి మొహాలు ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో !!
రామ్ గోపాల్ వర్మ
హ్యాట్సాఫ్
కొత్త భారతదేశం పుట్టింది. హ్యాట్సాఫ్ మోదీజీ.- రజనీకాంత్
మార్పు తెచ్చే అడుగు
మోదీజీ మీరు వేసిన ఈ అడుగు అన్ని పార్టీల వారు తమ పరిధులను దాటుకుని పండగ చేసుకునేలా చేసింది. హ్యాట్సాఫ్.
కమల్ హాసన్
ఇంట్రెవెల్ బ్యాంగ్ అదిరింది
ఐదేళ్ల పరిపాలన అనే సినిమాలో రెండేళ్ల తర్వాత .. అంటే సరిగ్గా విశ్రాంతికి ముందు హీరో నరేంద్ర మోదీ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఇంట్రెవెల్ బ్యాంగ్ అదిరింది. బ్లాక్ మనీకి ఇది బ్లాక్ డే.
హరీష్ శంకర్, దర్శకుడు
కొత్త స్వాతంత్రం
మోదీ నిర్ణయం భారత దేశానికి కొత్త స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. ప్రధాన మంత్రికి సెల్యూట్.
క్రిష్, దర్శకుడు
హ్యాపీ డే
నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు ఇది. నల్ల ధనంపై మోదీ వేసిన అస్త్రం తిరుగులేనిది. ఆయనకు నా కృతజ్ఞతలు.
మంచు మోహన్ బాబు
నిజమైన స్వచ్ఛ భారత్
బహుశా నిజమైన స్వచ్ఛ భారత్ అంటే ఇదేనేమో.. మోదీ దేశంలో బ్లాక్ మనీ లేకుండా శుభ్రం చేశారు.
రామ్, నటుడు
చెంపదెబ్బ
బ్లాక్ మనీ కలిగిన వారికి మోదీ గట్టి చెంప దెబ్బ ఇది. బ్లాక్ మనీ తీసేసి వైట్ ఇండియా చేసినందుకు మోడీకి హ్యాట్సాఫ్
జగపతిబాబు
అభివృద్ధి దిశగా భారత్
ట్యాక్స్ కట్టే వారికీ గౌరవం ఇచ్చినందుకు మోదీజీ కి థాంక్స్. ఇక భారత్ తప్పకుండా అభివృద్ధి చెందుతుంది
అక్కినేని నాగార్జున
