టాలీవుడ్ నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆదివారం అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈయన ఆసుపత్రిలోనే మృతి చెందారు. ఇలా కృష్ణంరాజు మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పాలి. ఇక ఈయన సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ వయసు పైబడటంతో రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేదు. ఈ విధంగా ఒక వైపు రాజకీయాలలోనూ మరోవైపు సినిమాలలోను తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు మరణించడంతో పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా తాజాగా నేడు కృష్ణంరాజు సంతాప సభను నిర్వహించడంతో
ఈ సంతాప సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్లో పర్యటించిన మొదటగా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయన భార్య శ్యామలాదేవి, తన కూతుర్లను పరామర్శించే వారికి ధైర్యం చెప్పారు. ఇక ప్రభాస్ కూడా అక్కడే ఉండడంతో ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు ఎలా మరణించారు అనే విషయాల గురించి ఆరా తీశారు.
ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ షేక్ పేట్ దర్గా సమీపంలో జేఆర్ సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభలో ఈయన పాల్గొన్నారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంట మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు