Chandramukhi 3: ‘చంద్రముఖి’ సీక్వెల్‌పై లారెన్స్‌ ఆసక్తికర సమాచారం… ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌!

  • April 18, 2023 / 05:05 PM IST

సౌత్‌ ఇండస్ట్రీలో రూపొంది.. బాలీవుడ్‌లోకూ వెళ్లి అదరగొట్టిన కొన్ని సినిమాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. అయితే ఇది పాన్‌ ఇండియా సినిమా కాదు. ఎందుకంటే అప్పుడు ఈ ఫీవర్‌ లేదు. దీంతో ఆ పేరు పెట్టుకోలేదు కానీ.. పాన్‌ ఇండియా లెవల్‌లో ఆ కథ అంత విజయం సాధించింది. రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో వండర్‌ అని చెప్పాలి. దానికి సీక్వెల్‌ అంటూ చాలా రోజులుగా వార్తలొచ్చినా ఇటీవల షూటింగ్‌ మొదలైంది. అయితే ఇప్పుడు దానికి కొనసాగింపు కూడా ఉందని వార్తలొస్తున్నాయి.

అవును, ‘చంద్రముఖి 2’ (Chandramukhi 3) సినిమా సెట్స్‌ మీద ఉండగానే మూడో ‘చంద్రముఖి’ కోసం వార్తలు బయటికొచ్చాయి. అయితే ఇవి పుకార్లు కాదు. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న లారెన్స్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లారెన్స్‌ ఈ మేరకు చెప్పుకొచ్చారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘చంద్రముఖి 3’ వస్తుందని చెప్పారు. దానికి సంబంధించి పాయింట్‌ తొలి ‘చంద్రముఖి’లోనే చూపించాం అని తెలిపారు. అలా ‘లకలకలకలక…’ అంటూ మూడోసారి జనాల్ని భయపెట్టబోతున్నారట.

‘రుద్రన్‌’ / ‘రుద్రుడు’ సినిమా ప్రచారంలో భాగంగా లారెన్స్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుందగా.. ‘చంద్రముఖి’ సినిమాలోని కీలకమైన పాము సన్నివేశం గురించి ప్రస్తావన వచ్చిందట. దాని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ఆ పాము సన్నివేశం సస్పెన్స్‌.. చంద్రముఖి మూడో భాగంలో దానికి ముగింపు ఉంటుంది’’ అని అన్నారు. దీంతో ‘చంద్రముఖి 3’ సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అయితే ఎప్పుడు ఈ సినిమా ఉండొచ్చు అనే విషయం మాత్రం చెప్పలేదు.

ఇక ‘చంద్రముఖి 2’ సినిమా సంగతి చూస్తే… రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌, రాధిక శరత్‌కుమార్‌, లక్ష్మీ మీనన్‌, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. అయితే విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus