Nayanthara: ‘చంద్రముఖి’ vs నయనతార.. నిజమేంటి? నిజంగానే డబ్బులు అడిగారా?

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ గురించి విషయం బయటకు వచ్చినప్పటి నుండి ఏదో వార్త బయటకు వస్తూనే ఉంది. ఆ డాక్యుమెంటరీలో చెప్పేవన్నీ నిజాలేనా? చూపించేవన్నీ కరెక్టేనా? ఆ విషయం చూపిస్తారా? ఆ విషయం చెబుతారా? అంటూ ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఈ లోపు ధనుష్‌ (Dhanush) నష్టపరిహారం అడిగిన విషయం బయటకు వచ్చేసరికి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మూడు సెకన్ల క్లిప్‌ వాడుకున్నందుకు ధనుష్‌ నోటీసులు పంపారు అంటూ నయనతార (Nayanthara)  ఓ బహిరంగ లేఖ రాసుకొచ్చింది.

Nayanthara

రూ. 10 కోట్లు డిమాండ్‌ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి ధనుష్‌ టీమ్‌ క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ విషయం ప్రస్తుతం కోర్టు దగ్గర ఉంది. ఇది ఇంకా తేలలేదు కానీ.. మరో నోటీసుల విషయం బయటకు వచ్చింది. ‘చంద్రముఖి’ (Chandramukhi) సినిమాలోని సన్నివేశాలు వాడుకున్నందుకు డబ్బులు చెల్లించమని నయన్‌కు ఆ సినిమా నిర్మాణ సంస్థ నోటీసులు పంపింది అని వార్తలు వచ్చాయి. దీనికి కారణం యూట్యూబ్ ఛానల్‌లో తమిళ నటుడు చిత్ర లక్ష్మణన్ చేసిన కొన్ని కామెంట్సే.

నిర్మాతల అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని దృశ్యాలను వాడటం సరికాదు అని కామెంట్‌ చేశారు. అంతేకాదు ‘చంద్రముఖి’ సినిమా టీమ్‌ నయనతారను రూ.5 కోట్ల నష్టపరిహారం అడిగిందని వార్తలు ఆ వీడియోతోపాటు బయటకు వచ్చాయి. అయితే ఈ విషయంలో ‘చంద్రముఖి’ నిర్మాతలు నయనతారపై ఎలాంటి చట్టపరమైన చర్యలకు పూనుకోలేదట. రూ.5 కోట్ల నష్టపరిహారం అడిగినట్లు వచ్చిన వార్తలను కూడా ఖండించారు.

డాక్యుమెంటరీలో దృశ్యాలను ఉపయోగించుకోవడానికి తాము అనుమతి ఇచ్చామని తెలిపారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయింది. మరి ఆ నటుడు అలా ఎందుకు చెప్పారో ఆయనే తెలియాలి. ఇక్కడో విషయం ఏంటంటే.. తన డాక్యుమెంటరీలో కొన్ని సినిమాల్లోని సీన్స్‌ వాడుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చిందుకు థ్యాంక్స్‌ చెబుతూ నయనతార కొన్ని రోజులు క్రితం ఓ నోట్‌ కూడా రిలీజ్‌ చేసింది. అందులో ‘చంద్రముఖి’ నిర్మాణ సంస్థ పేరు కూడా ఉంది.

‘గేమ్‌ ఛేంజర్‌’ చెన్నై ఈవెంట్‌ రద్దు.. నిజమేంటి? ఏం జరిగింది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus