విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ ఆగస్టు 25న విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. కొంతవరకు ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించినా… భారీ రేట్లకు బయ్యర్స్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేశారు కాబట్టి…వారు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. హిందీలో మాత్రం ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందు నుండి అక్కడ ప్రచారం బాగా చేశారు కాబట్టి..
అందులోనూ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి .. మైక్ టైసన్ వంటి బాక్సింగ్ దిగ్గజం కూడా ఉంది కాబట్టి ‘లైగర్’ అక్కడ బాగా కలెక్ట్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. వరల్డ్ వైడ్ గా అయితే ‘లైగర్’ చిత్రానికి రూ.83 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రూ.33 కోట్ల వరకు రికవరీ సాధించే అవకాశాలు ఉన్నా.. బయ్యర్లు రూ.50 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం ఫలితం పై నిర్మాతల్లో ఒకరైన ఛార్మి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే కూర్చొని భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి వారిని ఎగ్జైట్ చేసే సినిమాలు రానంతవరకు వారు థియేటర్లకు రారు. అందుకు వారు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ ..
చిత్రాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.ఆ సినిమాలు రూ.150 కోట్ల నుంచి రూ. 170 కోట్ల వరకు వసూళ్లు కురిపించాయి. కానీ బాలీవుడ్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019 నుండి ‘లైగర్’ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా ఆలస్యం అవ్వడంతో 3ఏళ్ళ తర్వాత ‘లైగర్’ ను ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్‌లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం అనే చాలా బాధగా అనిపిస్తుంది’ అంటూ ఛార్మి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!