Chatrapathi Movie: బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ బిజినెస్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్.. పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన వి.వి.వినాయక్ డైరెక్షన్ చేశాడు.టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగులో అయితే రిలీజ్ చేయడం లేదు. ఇక ఈ చిత్రం బిజినెస్ వివరాల గురించి సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతుంది. వాటి వివరాలు గనుక గమనిస్తే .. ‘ఛత్రపతి’ రీమేక్ కోసం ‘పెన్ ఇండియా’ సంస్థ రూ.50 కోట్లు ఖర్చు చేసింది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే వారికి రూ.65 కోట్లు వచ్చేశాయి. సో వాళ్ళు ప్రాఫిట్స్ లో ఉన్నట్టే.!

అందుకే ‘ఛత్రపతి’ ని ఓన్ గా రిలీజ్ చేసుకుంటున్నారు. సో థియేట్రికల్ పరంగా రెంట్లు వంటివి తీసేస్తే.. మిగిలిన భాగం ఎంతొస్తే అంత ప్రాఫిట్ అనే చెప్పాలి. అయితే ‘ది కేరళ స్టోరీ’ చిత్రం అక్కడ భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఆ సినిమా పక్కన హిందీ ‘ఛత్రపతి’ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది.

అయితే ‘ఛత్రపతి’ (Chatrapathi) నిర్మాతలు హ్యాపీనే కాబట్టి.. ‘పెన్ స్టూడియోస్’ సంస్థ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మరో రెండు సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఈ ఏడాదే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు కూడా బయటకు వస్తాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus