చంద్రబాబు అరెస్ట్ అయ్యి 18 రోజులు అవుతున్నా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించలేదనే సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందిస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించి తారక్ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాను నిర్మించిన నిర్మాత చెంగల వెంకట్రావు తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెంగల వెంకట్రావు టీడీపీ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ను (Jr NTR) టీడీపీకి దూరం పెట్టారని ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అందుకు సిద్ధంగా ఉండాలని చెంగల వెంకట్రావు కామెంట్లు చేశారు. ఒక సందర్భంలో బాలయ్యను సీఎం కావాలని కోరగా తన మెంటాలిటీకి సూట్ కాదని ఆయన అన్నారని చెంగల వెంకట్రావు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించానని ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నా మచ్చ చూడు..
నా జాతకం చూడు సీఎం అయ్యే యోగం ఉందని చెప్పాడని చెంగల వెంకట్రావు అన్నారు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అభ్యర్థిగా నిలబడతాడని సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే అలా జరగాలని చెంగల వెంకట్రావు కామెంట్లు చేశారు. చెంగల వెంకట్రావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ లేదా బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
తారక్ ప్రస్తుతం ఎలాంటి పొలిటికల్ కామెంట్లు చేయడం లేదు. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.