ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పుట్టిన రోజుల నాడు వారి పాత సినిమాలను 4K ప్రింట్లకు అప్డేట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యూ.ఎస్ లో కూడా ఆ సినిమాలను రీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఆ సినిమాలను థియేటర్ కు వెళ్లి మరీ ఎవరు చూస్తారు అని మొదట అనేక సందేహాలు నెలకొన్నాయి.
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ ‘పోకిరి’ టైంలో ఈ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆ మూవీ కోటిన్నర పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జల్సా’ ని కూడా రీ రిలీజ్ చేస్తే ఆ మూవీ రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా ‘ఘరానా మొగుడు’ ని రీ రిలీజ్ చేశారు కానీ ఆ మూవీ పై జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అయితే సెప్టెంబర్ 25న బాలకృష్ణ- వి వి వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ మూవీని రీ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో యూ.ఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా $25K డాలర్లను వసూల్ చేసింది. ‘పోకిరి’ చిత్రం రీ రిలీజ్ టైంలో మొత్తంగా $15K డాలర్లను వసూల్ చేసింది.
ఇక ‘జల్సా’ మూవీ మొత్తంగా $37K డాలర్లను వసూల్ చేసింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ‘చెన్నకేశవ రెడ్డి’ $25K డాలర్లను వసూల్ చేయడంతో ‘జల్సా’ రికార్డ్ కూడా బ్రేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీని 300 కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఓవరాల్ గా వచ్చిన కలెక్షన్లను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చారిటీకి ఇవ్వబోతున్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.