ప్రముఖ కోలీవుడ్ రచయిత వైరముత్తు పై సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి గతంలో ‘మీటూ’ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘పదేళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో వైరముత్తు తన అసిస్టెంట్ ను చిన్మయి వద్దకు పంపి.. గదికి రమ్మని పిలిచాడని’.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్మయికి మద్దతు పలుకుతూ కొందరు మహిళలు కూడా ముందుకు వచ్చారు. అదే సమయంలో కొన్ని కారణాల వలన డబ్బింగ్ సంఘం నుండీ తీసేయడం జరిగింది. అయినా.. చిన్మయి తగ్గలేదు. ఇదిలా ఉంటే… తాజాగా అల్వార్ పేటలో.. హీరో కమల్ హాసన్ కె.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి రజినీకాంత్ తో పాటు వైరముత్తు కూడా ముఖ్య అతిధిగా విచ్చేసారు.
దీనికి సంబందించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన చిన్మయి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.” ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయట మొహం చూపించడానికే భయపడుతున్నారు. కానీ వైరముత్తు మాత్రం డీఎంకే కార్యక్రమాలు, ఐఏఎస్ అధికారుల శిక్షణా కార్యక్రమాలు, తమిళ భాష వేడుకలు, పుస్తక ఆవిష్కరణలు, సినిమా వేడుకలకు అతిథిగా వెళ్తున్నాడు. ‘మీటూ’ ఆరోపణలు వైరముత్తు పై మాత్రం ప్రభావం ప్రభావం చూపించలేదు. వైరముత్తు లాంటి వారిని ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి.. పెద్ద వాళ్ళు ఎలా ఆహ్వానిస్తున్నారు. మరికొంత మంది గొప్పవాళ్ళు.. వైరముత్తు వంటి వారు హాజరయ్యే వేడుకలకి ఎలా వస్తున్నారో అర్థం కావట్లేదు. అంటూ రజినీ, కమల్ పై కూడా పరోక్షముగా కామెంట్లు చేసింది.