దశాబ్దాల పాటు నాలుగు పెద్ద కుటుంబాలకు చెందిన నలుగురు హీరోలు టాలీవుడ్ ని ఏలుతూ వచ్చారు. అది మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్. దాదాపు 25ఏళ్ళు టాప్ స్టార్స్ అంటే ఈ నలుగురే. ముఖ్యంగా 80-90 దశకాలలో వీరు టాలీవుడ్ ని ఏలేశారు. మహేష్, ఎన్టీఆర్, పవన్ ఎదిగేవరకు వీరిదే హవా, బాక్సాఫీస్ కింగ్స్ ఈ నలుగురే. మరి ఈ నలుగురు హీరోల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
ఎప్పటి నుండో టాలీవుడ్ నంబర్ వన్ గా ఉన్న చిరంజీవి ఇంకా తన స్టామినా చూపిస్తున్నాడు. ఆయన మార్కెట్ అండ్ పాపులారిటీ కొంచెం కూడా తగ్గలేదు. నలుగురిలో సైరా మూవీ తో పాన్ ఇండియా మూవీ చేసిన హీరోగా చిరు ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న బాలయ్య పరిస్థితి దారుణంగా తయారైంది. ఆయన వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. దారుణంగా ఆయన మార్కెట్ పడిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాలయ్య చిత్రాలకు యంగ్ హీరోల చిత్రాలకు వస్తున్న వసూళ్లు కూడా రావడం లేదు.
ఇక నాగార్జున పరిస్థితి కూడా ఏం బాగోలేదు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తర్వాత ఆయనకు హిట్ లేదు. గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన మన్మధుడు2 ఆశించిన విజయం సాధించలేదు. బాలయ్య, నాగార్జున లతో పోల్చుకుంటే వెంకటేష్ మంచి ఫార్మ్ కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆయన గురు, దృశ్యం వంటి హిట్ చిత్రాలలో నటించారు. గత ఏడాది విడుదలైన ఎఫ్ 2 సూపర్ హిట్ అవడంతో పాటు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇటీవల విడుదల అయిన వెంకీ మామ సైతం హిట్ అందుకుంది. ఇలా చిరు, వెంకీ ఫార్మ్ లో ఉంటే నాగ్, బాలయ్య వెనుకబడ్డారు.