44 ఏళ్ల కెరీర్.. 150కి పైగా సినిమాలు… ఇదీ చిరంజీవి కెరీర్‌ను సూక్ష్మంగా చెప్పాలంటే. ఇన్నేళ్ల కెరీర్‌ను ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో కథలు విని ఉంటారు. కొన్ని వదిలేసి ఉంటారు. అసలు సినిమా కథ విన్నప్పుడు చిరంజీవి ఎలా ఆలోచిస్తారు, కథను ఎలా చూస్తారు అనేది ఆసక్తికరం. వాటి గురించి యువ దర్శకులు కొందరు అడిగితే.. ఆయన చెప్పారు. వాటిలో కొన్ని మీ కోసం.
‘డాడీ’ సినిమా కథను చిరంజీవికి చెప్పినప్పుడు విని… ఇది నాకంటే వెంకటేశ్‌కి అయితే చాలా బాగుంటుంది అని చెప్పారట. అయితే రచయిత భూపతిరాజా మాత్రం ఈ కథ మీకైతే బాగుంటుంది అని చెప్పడంతో చిరంజీవి ఓకే అనుకుని చేశారట. సినిమా వచ్చాక మంచి ఫలితమే రాబట్టింది. కానీ సినిమా విడుదలయ్యాక వెంకటేశ్ ఫోన్ చేసి ‘సినిమా బాగుంది. నాకైతే చాలా బాగుంటుంది అనిపించింది’ అన్నారట. అలా తను ముందు అనుకున్నదే కరెక్ట్ అయ్యంది అని చిరంజీవి చెప్పారు.
మరో సినిమా విషయంలోనూ ఇదే జరిగింది అని చెప్పారు చిరంజీవి. తమిళ సినిమాను తెలుగులోకి ‘స్నేహం కోసం’గా తీసుకొచ్చారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి చాలా నమ్మి చేశారట. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమాకు ఆశించిన విజయం ఇవ్వలేదు. పెద్ద చిరంజీవి పాత్ర అలా విజయ్ కుమార్ దగ్గర ఉండటం నచ్చలేని కొంతమంది ఫ్యాన్స్ అన్నారని చిరు చెప్పారు. కథ వింటునప్పుడు… ఆ కథ నా హృదయాన్ని ఎంత డీప్‌గా టచ్ చేసింది అనేది చూస్తారట చిరంజీవి.
అలా టచ్ చేయగానే ఓకే చెప్పేస్తారట. అలా ఓకే చెప్పిన సినిమాలు మంచి విజయం అందుకున్నాయి అని చెప్పారు చిరంజీవి. సినిమా కథ వినప్పుడు మనసు స్పందిస్తే చాలు ఆ సినిమా మంచి విజయం అందుకుంటుంది అని నమ్ముతాను. కెరీర్‌లో అలా అనిపించిన సినిమాలు, అలా అనిపించని సినిమాలు కూడా ఉన్నాయన్నారు చిరంజీవి.