Chiranjeevi, Nagarjuna: బాలీవుడ్‌ సినిమా రీమేక్ అయితే రెడీ అంట..!

చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు దాటుతోంది. ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలు చేశారు, ఎన్నో సినిమాలకు తన వంతు సాయం అందించారు. అయితే ఏ సినిమాను కూడా ఆయన సమర్పించలేదు. తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నారు. అదే ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఆమిర్ ఖాన్‌ కథానాయకుడిగా రూపొందిన సినిమా ఇది. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో సినిమాలో ముఖ్య వ్యక్తులైన ఆమిర్‌ ఖాన్‌, చిరంజీవి, నాగచైతన్యను నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

ఆమిర్‌ ఖాన్‌ సినిమాలు, నటన పట్ల అతనికున్న ప్యాషన్‌.. ఇలా చాలా అంశాల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఆమిర్‌ నటించిన ఏ సినిమా చేయడానికి మీరు సిద్ధం అని చిరంజీవిని అడిగితే.. నాగార్జున్‌ – చిరు కాంబో బయటకు వచ్చింది. ‘‘ఆమిర్‌ లాంటి పర్‌ఫెక్షనిస్ట్‌ చేసిన సినిమాలు చేయడం అంత ఈజీ కాదని, అయితే సల్మాన్‌ ఖాన్‌తో ఆమిర్‌ నటించిన ‘అందాజ్‌ అప్నా అప్నా’ చేయడానికి అయితే రెడీ అన్నారు చిరంజీవి. దాంతో హోస్ట్‌ నాగ్‌ కూడా స్పందించారు.

‘అందాజ్‌ అప్నా అప్నా’ చేయడానికి ఇబ్బందేం లేదు. కామెడీ నేపథ్యంలో సాగిపోతుంది కాబట్టి చేసేయొచ్చు అని చిరంజీవి అంటే.. కావాలంటే మనిద్దరమే ఆ సినిమా చేయొచ్చు అని అన్నారు నాగార్జున. దీంతో చాలా కాలంగా నాగ్‌, చిరంజీవి కాంబోను చూద్దాం అనుకుంటూ ఆశగా ఉన్న అభిమానులు ఒక్కసారిగా హుషారయ్యారు. సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా సంగతేంటో చూసేద్దాం అని యూట్యూబ్‌కి వెళ్తున్నారు ఫ్యాన్స్‌.

చిరంజీవి, నాగార్జున.. ఈ విసయాన్ని సీరియస్‌గా తీసుకుంటే.. ‘అందాజ్‌ అప్నా అప్నా’ ఇప్పుడు తెరకెక్కడం పెద్ద విషయం కాదు. రాజ్‌కుమార్‌ సంతోషి తెరకెక్కించిన ఆ చిత్రం ఇప్పటికీ లైవ్లీగానే ఉంటుంది. మరి నాగార్జున, చిరంజీవి ఈ మాటను మాటవరుసకి అన్నారో, లేక సీరియస్‌గా చేసేస్తారా అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు అయితే చిరంజీవి డేట్స్ ఖాళీ లేవు. నాగార్జున అయితే డేట్స్‌ అడ్జస్ట్ చేయొచ్చు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus