మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తదుపరి చిత్రంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు 157 ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన మాస్ మసాలా సినిమాలపై ఫోకస్ పెట్టగా, ఈసారి అనిల్ కామెడీ టచ్‌తో మెగాస్టార్‌ను పూర్తిగా డిఫరెంట్ రోల్‌లో చూపించనున్నాడట. చిరు గతంలో చేసిన శంకర్ దాదా ఎంబిబిఎస్ (Shankar Dada M.B.B.S), అందరివాడు (Andarivaadu) లాంటి కామెడీ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే ట్రాక్‌లోనే ఈ సినిమా స్క్రిప్ట్ ఉంటుందని అనిల్ ఇప్పటి నుంచే హింట్ ఇస్తున్నాడు.
ప్రస్తుతం చిరు 157 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అనిల్ ఇప్పటికే కథను లాక్ చేసి, మొదటి భాగం కోసం స్క్రిప్ట్‌ను పూర్తిగా ఫైనల్ చేశాడట. ఇందులో రెండు ఫన్ సీక్వెన్సెస్ ఇప్పటికే చిరంజీవికి చాలా నచ్చాయని టాక్. చిరు ఎన్నో ఏళ్ల తర్వాత పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే, ఈ సినిమాతో అనిల్ రావిపూడికి కూడా ఓ పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఇప్పటివరకు అనిల్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. పటాస్ (Pataas) నుంచి ఎఫ్2 (F2 Movie), సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) వరకు అన్ని విజయవంతమైన చిత్రాలే. మరీ ముఖ్యంగా, ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ఏకంగా 300 కోట్ల మార్క్‌ను దాటి వెంకటేష్ (Venkatesh Daggubati) కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అటువంటి భారీ విజయాన్ని అందుకున్న అనంతరం చిరంజీవితో సినిమా అంటే ఖచ్చితంగా 300 కోట్లకు పైగా వసూలు చేయాల్సిందేనని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌లో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే చర్చ మొదలైంది. చిరు నటన, అనిల్ స్క్రిప్ట్ కలిసి వస్తే ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం ఖాయం. అయితే గత కొంతకాలంగా చిరంజీవి సినిమాలు వసూళ్ల పరంగా నిలకడగా లేకపోవడం, ముఖ్యంగా భోళా శంకర్ (Bhola Shankar) వంటి సినిమాలు నిరాశపరిచిన నేపథ్యంలో చిరు అనిల్ భారీగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అనిల్ కామెడీ ఫార్ములా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో చూడాలి.