ఎన్ని జనరేషన్స్ మారుతున్నా చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చిరంజీవిని ఎంతగానో అభిమానిస్తున్నారు. చిరంజీవి సైతం అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా చిరంజీవి గొప్పదనానికి సంబంధించిన ఒక ఘటనను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఒక చిన్నారి కంటి ఆపరేషన్ చేయించుకోగా మెగాస్టార్ కు వీరాభిమాని అయిన ఆ చిన్నారి ఆపరేషన్ పూర్తైన తర్వాత కళ్లు తెరిచి మొదట చిరంజీవిని చూడాలని కోరిందట.
ఈ విషయం తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా చిరంజీవికి తెలియడంతో ఆయన వెంటనే వస్తానని చెప్పారట. సాధారణంగా కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు ఒక చిన్నారి కోసం అన్ని పనులు వాయిదా వేసుకుని రావడం సులువు కాదు. అయితే చిరంజీవి మాత్రం చెప్పిన సమయానికి రావడంతో పాటు ఆ చిన్నారి కళ్లు తెరిచే సమయానికి కనిపించి ఆ పసిపాప ఆనందానికి కారణమయ్యారు. ఇలా అభిమాని కోసం టైమ్ కేటాయించే స్టార్ హీరోలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
అందుకే చిరంజీవి స్టార్ అయ్యారని కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానించే హీరో అయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి మంచి మనస్సుకు ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిరంజీవి రీఎంట్రీలో వరుస సక్సెస్ లను అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తన సినిమాల వల్ల నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో సైతం చిరంజీవి ముందువరసలో ఉంటారు.
నిర్మాతలకు చేసిన సహాయాన్ని చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి కూడా (Chiranjeevi) చిరంజీవి ఎప్పటికీ ఇష్టపడరు. 68 సంవత్సరాల వయస్సులో వేగంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి అభిమానుల హృదయాలకు ఎంతగానో దగ్గరవుతున్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాతో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.