టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీ పెద్దగా గుర్తింపు పొందాడు. చిరంజీవి నటించిన సినిమాల వల్లనే కాకుండా ఆయన చేసే సేవ కార్యక్రమాల వల్ల కూడా చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా పరిగణిస్తున్నారు. చిరంజీవి అవసరం ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి నిరుపేదలకు ఉచితంగా రక్తాన్ని దానం చేస్తున్నాడు.
ప్రతిఏటా చిరంజీవి పుట్టినరోజున ఆయన అభిమానులు భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇలా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యవసరాలు పంపిణీ చేసి కష్ట సమయంలో వారికి అండగా నిలిచాడు. ఇక ఈ ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగ ఇప్పటి వరకు 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు చిరంజీవి వెల్లడించాడు.
ఇలా రక్తాన్ని దానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన తన అభిమానులకు చిరంజీవి ఇటీవల భద్రత కార్డులను పంపిణీ చేసాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు చిరు భద్రత కార్డు పేరుతో ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ…బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడుతున్న చిరంజీవికి ఆమె అభినందనలు తెలియచేశారు. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ…1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ సంఘటన తనని ఎంతో కలచివేసిందని అందుకే బ్లడ్ బ్యాంక్ స్థాపించామని చిరంజీవి వెల్లడించాడు. అంతేకాకుండా త్వరలోనే ఒక ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని.. దీనిలో 70 శాతం రక్తం పేదల ప్రాణాలు కాపాడటానికి అందజేయగా.. మిగిలిన 30 % ప్రైవేట్ ఆస్పత్రులకు అందజేశామని చిరంజీవి తెలిపారు. తన అభిమానుల శ్రేయస్సు కోసం చిరంజీవి ఇలా భీమా పత్రాలను అందజేయడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.