పవన్ రాజకీయాల పై మరోసారి చిరు సంచలన కామెంట్స్..!

  • November 21, 2022 / 10:10 PM IST

‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు’ అంటూ ‘గాడ్ ఫాదర్’ లో ఓ పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు చిరంజీవి. చిరు రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారన్నది అక్షర సత్యం. కానీ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న టైంలో అప్పటి రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి అన్నది వాస్తవం. ఆయన జన బలం చూసి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలకు చెమటలు పట్టాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రోజుల్లో ఆయన 18 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అయితే తర్వాత సీఎం రాజశేఖర్ రెడ్డి మరణించడం. మరో పక్క జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం. ఆ కొత్త పార్టీలోకి అధికార పార్టీలో ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు జంప్ చేయడంతో..ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చిరు ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. అటు తర్వాత కొన్నాళ్ళు మంత్రిగా చేసిన చిరు.. మెల్లగా రాజకీయాలకు దూరం అయ్యారు.

అయితే తనలా తన తమ్ముడు కాదని, అతనికి జనబలం గట్టిగా ఉందని ఇటీవల చిరు పాల్గొన్న ఓ కార్యక్రమం చెప్పారు. చిరు మాట్లాడుతూ.. “నేను ఏదైనా ఒకటి తలిస్తే దాని అంతు చూడటం అనేది నాకు అలవాటైపోయింది.నా మనసులో నుండి రాకపోతే.. నేను దాని అంతు చూడలేను.అయితే నేను అంతు చూడలేకపోయింది ఏంటో మీకు తెలుసు. మళ్లీ వెనక్కి వచ్చేశాను. అక్కడ రాణించడం చాలా కష్టం అని తెలిసింది.

ఇక్కడిలా అక్కడ సున్నితంగా ఉంటే కుదరదు. బాగా మొరటు తేలాలి. రాటు తేలాలి. అన్నా.. అనకపోయినా మాటలు అనాలి.. అనిపించుకోవాలి. అవసరమా ఇది అనిపించింది.కానీ పవన్‌ అందుకు తగ్గవాడు. తను అంటాడు.. అనిపించుకుంటాడు కానీ వెనకడుగు వేయడు. అంతానికి నాతో పాటు మీరంతా కూడా ఉన్నారు. ఏదో ఒక రోజు మీ అందరి సహాయ, సహకారాలు ఆశ్సీసులతో .. ఏదో ఒకరోజున పవన్‌ని ఉన్నత స్థానంలో చూస్తాం’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus