మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. చిరంజీవి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు చిరంజీవి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారు. విశ్వంభర (Vishwambhara) మూవీ షూట్ 90 శాతం పూర్తి కాగా రెండు సాంగ్స్ పూర్తైతే ఈ సినిమా షూట్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.తమిళనాడులోని పాపులర్ టూరిజం స్పాట్ ఊటీలో చిరంజీవి ఆరు ఎకరాలు కొనుగోలు చేశారని 16 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారని సమాచారం.
ఊటీలోని కొండపైన చిరంజీవి ఆరు ఎకరాలు కొనుగోలు చేశారని అక్కడ ఫామ్ హౌజ్ నిర్మించాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి వైపు ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. చిరంజీవికి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సైతం ఫామ్ హౌజ్ లు ఉన్నాయని తెలుస్తోంది. చిరంజీవి షూటింగ్స్ లేని సమయంలో ఇతర రాష్ట్రాల్లోని ఫామ్ హౌస్ లలో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు.
చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను వేగంగా ప్రకటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తుండగా ఇతర భాషల్లో చిరంజీవి సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. చిరంజీవి కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
చిరంజీవి సినిమాల విషయంలో వేగం మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. చిరంజీవి క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి, చరణ్ (Ram Charan) కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.