గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి చాలా మారిపోయింది. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటం, సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదా యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉండటం, హీరో పాత్ర అంచనాలకు అందని విధంగా ఉండటం లాంటి అంశాలను ప్రస్తుతం ప్రేక్షకులు కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. రొటీన్ కథతో తెరకెక్కడం వల్లే ఆచార్య మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ వల్ల చిరంజీవి తర్వాత సినిమాల స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న చిరంజీవి వెకేషన్ పూర్తైన తర్వాత బరువు తగ్గాలని భావిస్తున్నారని బోగట్టా. అదే సమయంలో భోళా శంకర్ స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి స్వల్పంగా మార్పులు చెప్పారని సమాచారం అందుతోంది. అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ సినిమా తెరకెక్కింది. రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయని బోగట్టా. పెద్దగా మార్పులు లేకుండా సినిమా తీస్తే సినిమా రిజల్ట్ పైనే ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
చిరంజీవి తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల తర్వాత సినిమాల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయేమో చూడాల్సి ఉంది. కొత్తదనం ఉన్న కథలను చిరంజీవి ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తర్వాత సినిమాల ఫలితాలపైనే మెగాస్టార్ రెమ్యునరేషన్ కూడా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి తర్వాత సినిమాలతో విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరోవైపు ఆచార్య బయ్యర్లను ఆదుకోవాలనే ఆలోచనతో చిరంజీవి కొంతమేర రెమ్యునరేషన్ వెనక్కు ఇస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి మాస్ కథలకే ఓటేస్తూ యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.