చిరంజీవితో (Chiranjeevi) సినిమా ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు, ఒకవేళ వచ్చాక ఆ సినిమా పూర్తి స్థాయిలో సిద్ధమై బయటకు రావడమూ అంత ఈజీకాదు. ఎందుకంటే చాలా సినిమాలు చర్చల దశల్లో, షూటింగ్ దశలో, ఆ తర్వాతి దశల్లో నిలిచిపోయి, మురిగిపోయాయి. అయితే వాటిల్లో ఓ కామన్ పాయింట్ చూస్తే ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. అదే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) . ఆయన లేదంటే ఆయన దగ్గర శిష్యరిక చేసిన వాళ్ల సినిమాలు చిరంజీవితో ఓ పట్టాన తేలవు.
Chiranjeevi,Ram Gopal Varma:
కావాలంటే మీరే చూడండి. చాలా ఏళ్ల క్రితం చిరంజీవి – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలైంది. దానికి ‘వినాలని ఉంది’ అనే పేరు కూడా పెట్టారు. ఆ సినిమాకు సంబంధించి ఓ పావు వంతు షూటింగ్ కూడా జరిగింది. అయితే సినిమా విషయంలో తేడాలొచ్చి ఆపేశారు. కొన్నాళ్లకు అయినా తిరిగి మ మొదలవుతుందేమో అనుకుంటే ఆ సినిమాలోని పాటల్ని తర్వాత ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi) లో వాడేశారు.
ఇక ఆర్జీవీ శిష్యుడు కృష్ణ వంశీతో (Krishna Vamsi) కూడా చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘వందేమాతరం’ అంటూ 2004లో ఓ సినిమా అనుకున్నారు. అయితే బడ్జెట్ తదితర కారణాల వల్ల ఆ సినిమాను పట్టాలెక్కించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి పని చేయలేదు. అయితే రామ్‌చరణ్‌తో (Ram Charan) ‘గోవిందుడు అందరివాడేలే’ (Govindudu Andarivadele) చేశారు. ఆ సినిమా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక వర్మ మరో శిష్యుడు పూరి జగన్నాథ్‌తో (Puri Jagannadh) కూడా చిరంజీవి ఓ సినిమా అనుకున్నారు.
కథ దాదాపు ఓకే అయింది అనుకోగా.. సెకండాఫ్ విషయంలో ఇబ్బంది వచ్చి ఆపేశారు. ‘లైగర్’ (Liger) తర్వాత ఉండొచ్చు అనే టాక్ వచ్చినా.. ఆ సినిమా ఫలితం కారణమో ఏమో మళ్లీ వినిపించలేదు. ఇక ఆయన శిష్యుడు హరీశ్ శంకర్‌తో (Harish Shankar) చిరు సినిమా అని ఆ మధ్య మాటలు వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంలో ఎలాంటి లెక్కా తేలడం లేదు. కాబట్టి చిరంజీవితో ఆర్జీవీ అండ్ కో సినిమా అంటే అంత ఈజీ కాదు.