Chiranjeevi, Rajamouli: జక్కన్న అలా టార్చర్ చేస్తారన్న చిరంజీవి!

కొన్నిరోజుల క్రితం చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వార్తలు చిరంజీవి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించడంతో పాటు ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావించారు. అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ స్పందిస్తూ రాజమౌళి డైరెక్షన్ లో తన సినిమా అనేది రూమర్ అని తెలిపారు. రాజమౌళి తనతో సినిమా చేస్తానని చెప్పినా తాను చేయనని చెబుతానని చిరంజీవి కామెంట్లు చేశారు.

రాజమౌళి డైరెక్షన్ లో హీరో అంటే అతిగా కష్టపడాల్సి ఉంటుందని చిరంజీవి తెలిపారు. రాజమౌళి ఫిజికల్ గా టార్చర్ చేస్తారని పరోక్షంగా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి ఎంచుకునే రోల్స్, కథలు కూడా అదే విధంగా ఉంటాయని చిరంజీవి వెల్లడించడం గమనార్హం. ఒక నటుడిగా రాజమౌళిని సంతృప్తిపరచలేనని చిరంజీవి కామెంట్లు చేశారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని తన కోరిక అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే డైరెక్షన్ ఎప్పుడు చేస్తానో చెప్పలేనని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రస్తుతం నటనపైనే తాను దృష్టి పెడుతున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఒక మినీ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నానని పది పడకలతో అది ఏర్పాటు అవుతుందని మెగాస్టార్ అన్నారు. తన వంతు సహాయంగా ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆచార్య సినిమాతో మరో సక్సెస్ సాధిస్తామని చిరంజీవి, చరణ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కరోనా వల్ల ఆచార్యపై బడ్జెట్ భారం పెరిగిందని సమాచారం అందుతోంది. ఆచార్య కొత్తతరహా కథాంశంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఉందని చిరంజీవి వెల్లడించారు. అయితే రాజమౌళి మాత్రం సీనియర్ హీరోల కంటే యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus