టాలీవుడ్‌లో రీమేక్‌లు చేయని హీరోలు చాలా మంది తక్కువగా ఉంటారు. అయితే వాళ్లు ఫ్రీమేక్‌లు చేస్తుంటారు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే… ఇటీవల కాలంలో వరుస రీమేక్‌లు చేస్తుండటంలో చిరంజీవిని కొందరు సెటైరికల్‌గా ‘రీమేక్ స్టార్’ అనడం ప్రారంభించారు. ఈ మాట ఆ నోట ఈ నోట పడి చిరంజీవి వరకు వెళ్లినట్లు ఉన్నాయి. అందుకే ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. అది కూడా సాదాసీదాగా కాదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
‘నాకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను’ అని నా ‘ఖైదీ నం. 150’ సినిమాలో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్‌కి తగ్గట్టే… ‘భోళాశంకర్’ సినిమా మాతృక ‘వేదాళం’ సినిమా కథ నాకు నచ్చింది కాబట్టే చేశాను. ఈ సినిమా మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా అని తాను రీమేక్‌లు ఎందుకు ఎంచుకుంటున్నారో చెప్పారు. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నం చేస్తే తప్పేంటో నాకు అర్థంకావట్లేదు ఎందుకు ఇలా అంటున్నారో విమర్శలకు బలమైన సమాధానం ఇచ్చాడు (Chiranjeevi) చిరు.
ఇక ‘భోళా శంకర్’ ఎంచుకోవడం గురించి మాట్లాడుతూ… ‘భోళాశంకర్’ మాతృక చిత్రం ‘వేదాళం’ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేదు. మన దగ్గర ఎక్కువమంది చూసి ఉండరు. అదే ధైర్యంతో దర్శకుడు మెహర్ రమేశ్, నిర్మాత అనిల్ సుంకర నా దగ్గరకు వచ్చారు. అప్పుడు ఇప్పుడేగా ‘లూసిఫర్’ కమిట్ అయ్యాను. మళ్లీ రీమేక్ అంటే అభిమానులు గొడవ చేస్తారేమో’ అని అన్నాను. అయితే ‘బెస్ట్ కంటెంట్‌ని ఎందుకు రీమేక్ చేయకూడదు.
మీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎందుకు ఇవ్వకూదు’’ అని అన్నారట వాళ్లు. అలా ‘భోళా’ సెట్స్ మీదకు వచ్చింది అని చెప్పారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… చిరు సరసన తమన్నా నటించింది. హీరో సోదరిగా కీర్తి సురేశ్ నటించింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతోంది.