మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో క్రమశిక్షణ సంఘం పేరుతో ఓ సంఘాన్ని గతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘంలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, జయసుధ తదితరులు సభ్యులుగా ఉండేవారు. అయితే తాజాగా ఈ సంఘం నుండి చిరంజీవి తప్పుకున్నారని సమాచారం. ఆయన ఎందుకు తప్పుకున్నారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మా వ్యవహారాల్లో కీలకంగా ఉండే చిరు ఉన్నట్లుండి ఈ పదవి ఎందుకు వదిలేశారో తెలియడం లేదు. 2019లో సీనియర్ నటుడు నరేశ్ అధ్యక్షతన మా నూతన కార్యవర్గం ఏర్పాటైంది.
అందులో నటుడు రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే ఎన్నికైన కొన్ని రోజులకే వివిధ కారణాల కారణంగా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెండుగా విడిపోయారు. ఆ మధ్య ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా నరేశ్, రాజశేఖర్ మధ్య బేధాభిప్రాయాలు బయటపడ్డాయి. దీంతో మాలో క్రమశిక్షణ సంఘం ఏర్పాటు చేశారు. సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకునేలోపే రాజశేఖర్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కార్యవర్గం పాలనా కాలం ముగిసింది. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ సమయంలో క్రమశిక్షణ సంఘం ఇక అవసరం లేదనో, లేక ఉండటం ఇష్టం లేకో చిరంజీవి ఆ పది నుండి తప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. చిరంజీవి రాజీనామాను ఆయన పీఆర్ టీమ్ ధ్రువీకరించింది. త్వరలో మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిరంజీవి ఇలా రాజీనామా చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే నరేశ్ అధ్యక్షతన ఏర్పాటైన పాలకవర్గం చేపట్టిన పనులు, తీరు విషయంలో చిరంజీవి సంతృప్తిగా లేరని టాక్. మాములుగా చిరంజీవి మనసు గెలుచుకున్నవారే ‘మా’ అధ్యక్షుడు అవుతారని టాక్. మరి ఈ సారి ఎవరు పోటీలో నిలుస్తారో చూడాలి.