మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఆయన ఓ కథకి ఎస్ చెప్పాలన్నా, నో చెప్పాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఆయన ఎస్ చెప్పారు అంటే ఆ కథ కచ్చితంగా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. కొన్ని సార్లు మిస్ ఫైర్ అయినా 90 శాతం అయితే ఈయన జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది. బహుశా అందుకే ఆయన ఇప్పటివరకు స్టార్ హీరోగా రాణిస్తున్నారు అనుకుంట.
ఇదిలా ఉండగా.. చిరంజీవి దగ్గరకి వచ్చిన ఓ కథ.. ఆయనకి నచ్చనప్పటికీ బలవంతం మీద చేశారట. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చిరు ఇమేజ్ వల్ల ఆ మూవీ అంతంత మాత్రంగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసింది. ఈ మూవీ గురించి ఓ సందర్భంలో చిరు మాట్లాడుతూ.. ” ‘డాడీ’ మూవీ కథ నాకు వినిపించగానే…ఇది నాకంటే వెంకటేష్ కు అయితే బాగుటుందనిపించింది.అదే విషయాన్ని రచయిత భూపతి రాజాకు కూడా చెప్పాను.
దానికి ఆయన… ‘వెంకటేష్ చేస్తే రొటీన్ గా ఉంటుంది. నేను చేస్తే ఫ్యామిలీ మెన్ ఇమేజ్ కు కాస్త దగ్గరగా అదే టైములో వెరైటీగా కూడా ఉంటుందని’ నన్ను కన్విన్స్ చేశారు. ఈ కథ విన్న వారంతా.. చిన్న పిల్లలతో మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. దీంతో కథ నాకు కరెక్ట్ కాదు అనిపించినా సరే బలవంతంగా ‘డాడీ’ ఒప్పకున్నా. రిజల్ట్ కూడా అలానే వచ్చింది. కథ విన్నప్పుడు ఏం అనుకున్నానో.. అదే జరిగింది.
సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ నాకు ఫోన్ చేసి ‘భలే సినిమా అండీ.. నేను చేసుంటే ఇంకా బాగా ఆడేదండీ’ అన్నాడు. ‘నేను అదే చెప్పాను వెంకటేష్.. కానీ వినలేదు’ అని అన్నాను. ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా కెరీర్లో ఉన్నాయి’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. కొంచెం ఇలాంటి కథనే బోయపాటితో వెంకటేష్ ‘తులసి’ గా చేసి హిట్ కొట్టారు.మళ్ళీ దానినే తమిళ జనాలకి ‘విశ్వాసం’ గా అందించాడు అజిత్.