Chiranjeevi: నాగ చైతన్య ‘ల‌వ్ స్టోరీ’ కి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్..!

అప్పట్లో దాసరి నారాయణ రావుగారిలా ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వ సినిమాల వేడుకలకి ఎక్కువగా హాజరవుతూ అభిమానులకి కనువిందు చేస్తున్నారు. తన కుటుంబానికి చెందిన హీరోల సినిమాలకే కాకుండా చిన్న, మీడియం రేంజ్ హీరోలు అలాగే మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల వేడుకలకి కూడా ఆయన హాజరవుతూ వస్తున్నారు. అయితే చిరంజీవి ఓ సినిమా వేడుకకి వస్తున్నారు అంటే చాలా వరకు తన సినిమాలకి సంబంధించి కీలకమైన విషయాలను లీక్ చేయడం వంటివి చేస్తున్నారు.

దీంతో ఆయన పై మీమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి.ఇది పక్కన పెట్టేస్తే.. ఈ ఆదివారం నాడు అనగా సెప్టెంబర్ 19న జరగబోయే ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా చిరు హాజరవుతున్నారు. నాగార్జున‌- చిరంజీవి అత్యంత సన్నిహితులు, బిజినెస్ పార్ట్నర్స్ అన్నది బహిరంగ రహస్యమే. నాగార్జున ప్రతీ సినిమాని చిరు సపోర్ట్ చేస్తారు. ‘జోష్’ ‘హలో’ వంటి సినిమాలను కూడా చిరు సపోర్ట్ చేశారు. నాగ్ `వైల్డ్ డాగ్` సినిమాకి కూడా చిరు సపోర్ట్ ఇచ్చారు.

ఇప్పుడు `ల‌వ్ స్టోరీ` కి కూడా తన వంతు సపోర్ట్ ఇవ్వనున్నారు చిరు. శేఖర్ కమ్ముల కూడా చిరు, నాగార్జునలకు పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత గ్రాండ్ గా జరుగబోతున్న.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘లవ్ స్టోరీ’ అనే చెప్పాలి. సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో విడుదల కాబోతుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus