అవార్డులు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఇస్తామంటేనేమో చర్చించడానికి ఎవరూ ముందుకు రారు. ఈ మాట మేం అంటున్నది కాదు. గత రెండు రోజులుగా టాలీవుడ్ జనాల గురించి నెటిజన్లు అంటున్న మాట ఇది. చాలా ఏళ్లుగా తెలుగు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం లేదు. దీంతో ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రస్తావిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు. చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులకు ‘గద్దర్ అవార్డ్స్’ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇది జరిగి చాలా రోజులైంది కూడా. దీంతో అవార్డుల గురించి చర్చలు జరుగుతున్నాయేమో, కమిటీలు వేస్తున్నారేమో అనుకుంటున్నారు సగటు జనాలు. కానీ చూస్తే.. ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే చెపపారు. ఆయన ఆ మాటలు అన్న నేపథ్యంలో ప్రముఖ కథానాయకుడు చిరంజీవి వెంటనే స్పందించి.. ‘అవార్డులు ఇస్తామంటున్నారుగా.. మాట్లాడరేం’ అని ట్వీట్ చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘గద్దర్’ పేరిట సినిమా పరిశ్రమకు పురస్కారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా సినీ ప్రముఖుల నుండి స్పందన లేదు. వాళ్లు ముందుకొచ్చి ఆ ప్రతిపాదనకి సంబంధించిన కార్యచరణని ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడు రెండో ఆలోచన లేకుండా పురస్కారాల్ని అందజేస్తాం అని చెప్పారు. అప్పుడు కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ సీరియస్‌గా లేదు అనేది తెలియలేదు. అయితే ఇలా రేవంత్ రెడ్డి అనగాన.. అలా చిరంజీవి (Chiranjeevi) ఎక్స్ ద్వారా స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని అవార్డుల్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లేందుకు బాధ్యత వహించాలని ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను కోరారు చిరంజీవి. గతంలో రేవంత్ సమక్షంలో గద్దర్ అవార్డులపై మాట్లాడిన వీడియోను కూడా ఆ ట్వీట్‌కి యాడ్ చేశారు చిరంజీవి. మరోవైపు చిరంజీవి ట్వీట్‌ను సపోర్టు చేస్తూ సాయి తేజ్ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా ట్వీట్ చేశారు. మరి ఇప్పటికైనా తెలుగు సినిమా సంఘాలు ఏమన్నా స్పందిస్తాయేమో చూడాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024