‘కొండవీటి సింహం’ సినిమాలో చిరంజీవిని తీసేసి మోహన్ బాబును తీసుకున్నారు.. ఎందుకో తెలుసా?

  • March 18, 2023 / 02:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం అందరికీ తెలిసిందే.67 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు. బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు రూ.100 కోట్లు, రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ చిరు ఇలా రాణిస్తుండడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పటి యంగ్ స్టార్స్ కూడా చిరంజీవి అంటే ఎవరు అన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు.

కానీ కెరీర్ ప్రారంభంలో చిరంజీవి ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చాడు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. చెన్నై వెళ్లి యాక్టింగ్ కోర్సు చేసిన చిరంజీవి.. ఆఫర్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. కిందా మీదా పడి ఆయన నటుడిగా నిలదొక్కుకుంటున్న టైంలో.. ‘కొండవీటి సింహం’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. 5 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారు చిరు. కానీ తర్వాత చిరుని తప్పించి మోహన్ బాబుని తీసుకుందట చిత్ర బృందం.

ఎందుకు ఇలా జరిగింది అంటే..! చిరంజీవి ‘కొండవీటి సింహం’ సినిమాలో ఎన్టీఆర్ కు కొడుకుగా నటించాలి. అదే ఏడాది చిరు… ఎన్టీఆర్ తో ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో కలిసి నటించారు. దానికి అలాగే ‘కొండవీటి సింహం’ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు గారే దర్శకుడు. కానీ ‘కొండవీటి సింహం’ లో కొడుకు పాత్ర అనే సరికి చిరంజీవి .. పాజిటివ్ రోల్ అనుకున్నారట.కానీ తండ్రిని ఎదిరించే పాత్ర అది. ఎన్టీఆర్ కు ధీటుగా చిరంజీవి డైలాగులు చెప్పాల్సి ఉంది.

కానీ చిరంజీవి అంత అగ్రెసివ్ గా డైలాగులు చెప్పలేకపోయారట. ఎన్టీఆర్ ముందు ఆయన డైలాగులు చెప్పడానికి కూడా తడబడ్డారట. అందుకే చిత్ర బృందం చిరంజీవితో 5 రోజులు షూటింగ్ అనంతరం అతని ప్లేస్ లో మోహన్ బాబుని తీసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసినప్పటికీ.. కథ మొత్తం ఎన్టీఆర్ – మోహన్ బాబు ల పాత్రల చుట్టూనే తిరుగుతుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus