లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంది. తెలుగులో దసరాకు విడుదల కానున్న సినిమాలలో ఈ సినిమాపైనే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలేవీ దసరాకు రిలీజ్ కాకపోవడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లుతెలుస్తోంది. అయితే గాడ్ ఫాదర్ తెలుగు హక్కులను మాత్రమే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందా లేక గాడ్ ఫాదర్ హిందీ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. గాడ్ ఫాదర్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్,
కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గాడ్ ఫాదర్ టీజర్ లో చిరంజీవి లుక్ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ప్రేక్షకుల మెప్పుపొందుతున్నారు. చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య థియేటర్లలో రిలీజ్ కానుండగా సమ్మర్ లో భోళా శంకర్ రిలీజ్ కానుంది. వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకుడు కాగా భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.