Mahesh Babu: మహేష్ బాబుపై అలాంటి కామెంట్లు.. వాస్తవాలు ఇవే!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తండ్రి కృష్ణ అంటే ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కృష్ణకు ఏ చిన్న కష్టం రాకుండా కృష్ణ జీవించి ఉన్న చివరి క్షణం వరకు మహేష్ బాబు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలను నిర్వహించడంపై కొంతమంది మహేష్ గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సొంత స్థలంలో కృష్ణ అంత్యక్రియలను మహేష్ నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి మహేష్ బాబు సన్నిహితులు స్పందించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ కోరిక మేరకు మహేష్ కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారని వాళ్లు చెబుతున్నారు. ప్రతి కుటుంబం వేర్వేరు ఆచారాలను పాటిస్తుందని ఆచారాలను సాంప్రదాయాలను కాదని అంత్యక్రియలను వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించడం సరికాదని మహేష్ భావించారని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో మహేష్ బాబుపై విమర్శలు చేస్తే వాళ్లు మూర్ఖులు అని తండ్రి అంత్యక్రియల విషయం ఏది కరెక్టో?

ఏది రాంగ్? అనే విషయం మహేష్ బాబుకు తెలియదా? అని మరి కొందరు చెబుతున్నారు. మహేష్ వ్యక్తిగత జీవితం గురించి నెగిటివ్ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎంతోమంది ప్రముఖుల అంత్యక్రియలు స్మశాన వాటికల్లోనే జరిగాయని ఈ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. మహేష్ బాబు ఏ విషయం గురించి అయినా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడని నెగిటివ్ కామెంట్ల గురించి రాబోయే రోజుల్లో మహేష్ స్పష్టత ఇస్తారని మరి కొందరు చెబుతున్నారు.

మరోవైపు మహేష్ కొంతకాలం పాటు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు. వరుస విషాదాల వల్ల మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతుండటం గమనార్హం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో మహేష్ నటించాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల మహేష్ ప్రాజెక్ట్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus