‘చెర్రీ-ఆరవింద్’ మధ్య కోల్డ్ వార్!!!
- November 18, 2016 / 09:28 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు….అయితే ఆ ఫ్యామిలీ అభిమానులైతే ఆ సినిమా హీరోలని సాక్షాత్తూ దైవాల కిందే కోలుస్తారు అనే చెప్పాలి…ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీకి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని తెలుస్తుంది…ఇప్పాట్‌కీ మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ లో అనుకున్నంత భారీ హైప్ లేకపోవడం, అదే క్రమంలో మెగాస్టార్ సినిమా విషయం పక్కన పెడితే….చెర్రీ ధృవ సినిమాతో వస్తున్నట్లు చాలా మందికి తెలియకపోవడం చూస్తూ ఉంటే…ఏదో తెలియని గ్యాప్ కాస్త ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ధృవ సినిమా పుణ్యమా అంటూ అటు అల్లు ఆరవింద్, ఇటు చెర్రీ మధ్య కాస్త ఇబ్బందులు తలెత్తినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది…అసలు ఇంతకీ ఏమయ్యింది అంటే…ఇప్పటికీ విడుదలయిన ధృవ సినిమా పాట్లు పెద్దగా ఆకట్టుకొకపోవడంతో ఎలా అయినా ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నంలో ఉన్నాడు చెర్రీ.
అందులో భాగంగానే ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఎంత తొందరగా భారీ ఎత్తున పెడితే అంత ‘ధృవ’ సినిమాకు మంచిది అన్న అభిప్రాయంలో చరణ్ ఉన్నట్లు టాక్. అయితే ఈ విషయంలో అల్లుఅరవింద్ అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు. అసలు ‘ధృవ’ రిలీజ్ డేట్ ఫిక్స్ కాకుండా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించడం ఏ మాత్రం ప్రయోజనం ఉండదని అరవింద్ అభిప్రాయ పడుతున్నట్లు టాక్. దీనికితోడు ప్రజల కరెన్సీ కష్టాలు తీరకుండా ‘ధృవ’ ను ఖంగారు పడి డిసెంబర్ లో విడుదల చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అరవింద్ చరణ్ కు నచ్చచెపుతున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇలా ప్రతీ విషయంలో చెర్రీ…ఆరవింద్ వాదనలకు దిగుతుంటే వారి మధ్య రోజురోజుకీ దూరం పెరుగుతూ వస్తుంది అని టాలీవుడ్ లోని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















