అబ్బో.. అలీ మంచి అల్లుడినే పట్టేశాడు..!

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్ అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కొద్దిపాటి బంధుమిత్రులు, సినీ తారల మధ్యలో ఫాతిమా వివాహం జరిగింది. ఇక పెళ్లి వేడుకకు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని, మెగాస్టార్‌ చిరంజీవిని, అక్కినేని నాగార్జున ని..ఇంకా చాలామంది సెలబ్రిటీలను ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వానించారు అలీ దంపతులు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలాగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయిన హల్దీ, సంగీత్ వంటి వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఇక పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవి అలాగే ఆయన సతీమణి సురేఖ, నాగార్జున- అమల దంపతులు, ప్రముఖ నటి అలాగే రాజకీయ నాయకురాలు అయిన రోజా వంటి వారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతను ఏం చేస్తుంటాడు?

వంటివి అనేక ప్రశ్నలు అందరి మైండ్లోనూ ఉన్నాయి. అయితే ఫాతిమా.. రీసెంట్ గానే డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసింది. ఆ టైంలో అలీ చాలా సంబరపడిపోయాడు.అలాంటిది ఫాతిమాకి పెళ్లి చేసేస్తే ఆమె డాక్టర్ గా ఎలా కొనసాగుతుంది. అందుకే తనకు కాబోయే అల్లుడిగా కూడా డాక్టర్ నే సెలెక్ట్ చేసుకున్నాడు అలీ. అవును అతని అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టరే. ఇతను జమీలా బాబీ, జిలానీ భాయ్ దంపతుల కొడుకు.

ఇతనికి ఓ అన్నయ్య, సోదరి ఉన్నారు. షెహ్యాజ్ వదిన కూడా డాక్టరే కావడం మరో విశేషం. వీళ్లది గుంటూరు. కానీ లండన్ లో సెటిల్ అయ్యారు. షెహ్యాజ్ కుటుంబంలో అందరూ ఉన్నత విద్య చదువుకున్నవారే..!వీళ్లది బాగా డబ్బున్న కుటుంబం కూడా.! అందుకే ఏరి కోరి అలీ దంపతులు షెహ్యాజ్ ను అల్లుడిగా చేసుకున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus