బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం టిక్కెట్ టు ఫినాలే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీంట్లో హౌస్ మేట్స్ ఉత్సాహంగా పాల్గొంటూ పోటీపడ్డారు. అయితే, ఫస్ట్ టాస్క్ అయిన స్నోమ్యాన్ లో శ్రీసత్య , ఇనయా, ఇంకా కీర్తి ముగ్గురూ కూడా అవుట్ అయిపోయారు. దీంతో ఈ ముగ్గురూ రేస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, అనూహ్యంగా ఈ ముగ్గురికి ఇంకో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ముగ్గురమ్మాయిలకి రింగ్ లో రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చాడు. దీంతో ఈ టాస్క్ లో ముగ్గురూ పోటీ పడి మరీ ఆడారు.
అయితే, మొదటిరౌండ్లో మరోసారి శ్రీసత్య ఎలిమినేట్ అయిపోయింది. ఇనయ ఇంకా కీర్తి ఇద్దరూ కలిసి శ్రీసత్యని టార్గెట్ చేశారు. దీంతో ఫస్ట్ రౌండ్ లోనే వెనుతిరిగింది. తర్వాత కీర్తి ఇంకా ఇనయా ఇద్దరూ టాస్క్ లో నిలిచేందుకు పోటీపడ్డారు. కీర్తి – ఇనయ ఇద్దరూ కిందా మీదా పడి మరీ టాస్క్ ఆడారు. ఇద్దరి టీషర్ట్స్ రంగులతో తడిసిపోయాయి. సంచాలక్ అయిన రేవంత్ కి ఎవరి టీషర్ట్ పై ఎక్కువ రంగు పడిందో నిర్ణయించేందుకు చాలా సమయం పట్టింది.ఇక కొద్దిగా తేడాతో కీర్తిని విన్నర్ గా ప్రకటించాడు రేవంత్.
దీంతో కీర్తి తిరిగి టిక్కెట్ టు ఫినాలే టాస్క్ లోకి వచ్చింది. మిగిలిన ఆరుగురి మద్యలో గట్టి పోటీ ఉంటుందని అనుకున్నారు హౌస్ మేట్స్. కానీ, బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఆరుగురులో నుంచీ ఒక ఇద్దరిని ఏకాభిప్రాయంతో తొలగించాలని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. టిక్కెట్ టు ఫినాలే టాస్క్ లో ఏకాభిప్రాయం ఏంటి బిగ్ బాస్ అంటూ ప్రశ్నించారు. కానీ, బిగ్ బాస్ కనికరించలేదు. ఏకాభిప్రాయంతో చెప్పకపోతే టాస్క్ రద్దు చేస్తానని చెప్పడంతో హౌస్ మేట్స్ కి చెప్పక తప్పలేదు.
అందరూ కలిసి కీర్తిని ఇంకా రోహిత్ ని టాస్క్ నుంచీ తొలగించారు. కీర్తి రీ ఎంట్రీ ఇచ్చిందని, రోహిత్ టాస్క్ లో స్ట్రాంగ్ అంటూ పోటీ నుంచీ తొలగించేశారు. దీంతో ఫైనల్ రౌండ్ లో ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్, శ్రీహాన్ నలుగురు పార్టిసిపేట్ చేశారు. ఈ నలుగురికి పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ లో చివరిగా రేవంత్ ఇంకా ఆదిరెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరిలో ఆదిరెడ్డి టిక్కెట్ టు ఫినాలే గెలిచినట్లుగా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.
ఇంతకీ ఆదిరెడ్డి ఎలా గెలిచాడు ? టాస్క్ లో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆదిరెడ్డి నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈవారం సేఫ్ అయితేనే ఫినాలేకి వెళ్తాడు. లేదంటే మాత్రం ఫినాలే టిక్కెట్ కొట్టి ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయి చరిత్ర సృష్టిస్తాడు. మరి ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరం. అదీమేటర్.