సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. దీంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను ‘కూలీ’ మ్యాచ్ చేయలేదు అనే చెప్పాలి. లోకేష్ కనగరాజ్ ఫ్లాట్ నెరేషన్ సినిమాకు మైనస్ అయ్యింది.
అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం పర్వాలేదు అనిపించాయి. దీంతో సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. వీకెండ్ కు మ్యాగ్జిమమ్ రికవరీ సాధించింది. మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.70 cr |
సీడెడ్ | 5.61 cr |
ఉత్తరాంధ్ర | 4.71 cr |
ఈస్ట్ | 2.54 cr |
వెస్ట్ | 2.10 cr |
గుంటూరు | 2.62 cr |
కృష్ణా | 2.39 cr |
నెల్లూరు | 1.38 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 35.05 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 2.18 cr |
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 2.90 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 40.13(షేర్) |
‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ చిత్రం రూ.40.13 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.70.4 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 6.87 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.