బిగ్‌బాస్ షోకి దేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. అందుకే ఏ భాషలో షో ప్రారంభించినా భారీ టీఆర్పీతో, వ్యూస్‌తో దూసుకుపోతోందీ షో. తాజాగా ఓటీటీ వెర్షన్లు కూడా తీసుకొచ్చారు. తెలుగులో ఓటీటీ కోసం బిగ్‌బాస్ నాన్‌స్టాప్ అనే పేరుతో షోను శనివారం రాత్రి ప్రారంభించారు. కొత్త వెర్షన్‌కు ప్రేక్షకులు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అయితే విమర్శకులు మాత్రం అప్పుడే నోటికి పని చెప్పారు. ఇందులో సీపీఐ నాయకులు నారాయణ ఎప్పుడూ ముందుంటారు. ఈసారీ అదే పరిస్థితి.
గతంలో బిగ్‌బాస్ సీజన్ మొదలైనప్పుడు, మొదలైన తొలి నాళ్లలో ఆ షోను విమర్శిస్తూ వీడియో బైట్‌లు రిలీజ్ చేశారు నారాయణ. తాజాగా అనంతపురంలో జరిగిన ఓ ప్రెస్ మీట్ వేదికగా బిగ్‌బాస్ షోను తూర్పారబట్టారు. ఈ షోను ఏకంగా బ్రోతల్ హౌస్ అని వ్యాఖ్యానించారు. అంతేకాఉద ఇలాంటి షోకు హోస్ట్‌గా చేయడం సరికాదంటూ నాగార్జునను కూడా విమర్శించారు. రియాలిటీ షోగా చెబుతున్న ‘బిగ్‌బాస్’ లైసెన్స్ పొందిన అనైతిక షో అంటూ ఘాటుగా విమర్శించారు.
‘అన్నమయ్య’ లాంటి సినిమాల్లో నటించిన నాగార్జున ఇలాంటి షోకు హోస్టింగ్ చేయడం సరికాదని సూచించారు నారాయణ. బిగ్‌బాస్ షోలో కొంతమందిని ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు మహిళలను అవమానపరిచే విధంగా ఈ షో ఉంటోందని కూడా విమర్శించారాయన. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ షోను తక్షణమే నిలిపేయాలంటూ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని నారాయణ చెప్పారు. ముందుగా చెప్పుకున్నట్లు సీపీఐ నారాయణ గత కొన్నేళ్లుగా ఈ వినోదాన్ని అలాంటి మాటలతోనే పోలుస్తూ వస్తున్నారు.
అంతమందిని ఒకే దగ్గర ఉంచి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేలా చూస్తున్నారు అంటూ షో యాజమాన్యాన్ని విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ వస్తున్న నేపథ్యంలో అదే మాట మళ్లీ అన్నారు. గతంలో ఆయన వ్యాఖ్యలకు షో తరఫు నుండి ఎవరూ స్పందించింది లేదు. ఇప్పుడూ అదే సమాధానమా? ఏమో చూద్దాం.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!