Prabhas , Gopichand: ప్రభాస్, గోపీచంద్ కాంబోలో ఆ బ్యానర్ లో సినిమా వచ్చే ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు (Prabhas) సినిమా ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితులలో గోపీచంద్ (Gopichand )  ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రభాస్, గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన వర్షం మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మరికొన్ని గంటల్లో గోపీచంద్ విశ్వం (Viswam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభాస్ తో సినిమా చేయాలని తనకు కూడా ఉందని అయితే మా ఇద్దరి కాంబోలో సినిమా రావాలంటే అన్నీ సెట్ కావాలని గోపీచంద్ కామెంట్లు చేశారు.

Prabhas , Gopichand

మా కాంబినేషన్ కుదిరితే సినిమా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. యూవీ బ్యానర్ లో ఒక సినిమాకు సంబంధించి చర్చ జరుగుతోందని గోపీచంద్ వెల్లడించారు. యూవీ బ్యానర్ ప్రభాస్ (Prabhas) ఫ్రెండ్స్ బ్యానర్ అనే సంగతి తెలిసిందే. యూవీ బ్యానర్ లో ఇప్పటికే ప్రభాస్ పలు సినిమాలలో నటించారు. యూవీ బ్యానర్ లో గోపీచంద్ సోలో హీరోగా నటించడానికి బదులుగా ఈ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

యూవీ నిర్మాతలు తలచుకుంటే ఈ కాంబినేషన్ లో సినిమా సాధారణ విషయం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గోపీచంద్ విశ్వం సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. శ్రీనువైట్ల మార్క్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పాజిటివ్ రివ్యూలు వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్చు.

చాలా ఏరియాలలో విశ్వం బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది. విశ్వం మూవీ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. గోపీచంద్ సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus