కొత్తది ఎప్పుడు వ్యతిరేకతకు గురవుతుంది.. తర్వాత ఆమోదం పొందుతుంది.. చివరకు అభినందనలు అందుకుంటుంది. కొత్తబాటలో ప్రయాణించేటప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. పక్క వారి విమర్శలకు బయపడ్డామా లక్ష్యాన్ని చేరుకోలేము. కానీ ఆ విమర్శలే తనని విజయం వైపు నడిపించాయని పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పారు. డి.సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, ఎస్. రంగినేని నిర్మించిన ఈ చిత్రం విజయంతంగా 50 రోజులకు చేరుకుంది. విజయ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ మూవీ జూలై 29న విడుదలై బిగ్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తాను పడిన కష్టాన్ని ఫేస్ బుక్ మిత్రులతో పంచుకున్నారు.
“కోటి రూపాయల సినిమాలు ఆడవు, దీని కన్నా మంచి కథను తీసుకో అని పరిశ్రమలోని కొందరు చెప్పి నిరుత్సాహ పరిచేవారు. పెళ్లి చూపులు సినిమా పై యూనిట్ సభ్యుల్లోనే నమ్మకం ఉండేది కాదు. నాకు వినిపిస్తుందనే విషయం పట్టించుకోకుండా “చిన్న సినిమా” అనే వారు. ఆ మాటే నాలోని కసిని పెంచింది. ప్రతిరోజు ఇంకా ఎలా బాగా తీయగలను అని అలోచించి కష్టపడేవాణ్ణి” అని షూటింగ్ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. సినిమా తీసిన తర్వాత కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. “కొందరు ఈ సినిమా చూసి “ఇది షార్ట్ ఫిలిం కదా, రెండు గంటలు ఎందుకు తీసావు” అని అన్నారు. అప్పుడు నాకు కోపం రాలేదు, ఎందుకంటే వారి తెలివి అంతే అనుకున్నాను” అని తరుణ్ భాస్కర్ వివరించారు. ఇంకా అతను చెప్పిన సంగతుల కోసం.. కింద లింక్ ని క్లిక్ చేయండి.