Pooja Hegde: ఫ్యాన్స్ కు పూజాహెగ్డే కొత్త సలహా!

ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి, నిరాశ అనేవి చాలా కామన్. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు కూడా ఇదేమీ కొత్తకాదు.. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె చాలా ఒత్తిడికి గురవుతుందట. మనసుకి బాధగా అనిపించినప్పుడు.. ఒత్తిడి ఫీలైనప్పుడు ఐదు నిమిషాలు ఏడుస్తానని చెబుతోంది పూజాహెగ్డే. ఒత్తిడిలో ఉన్నప్పుడు సంగీతమే తనకు మెడిసిన్ అని.. మానసికంగా బాలేనప్పుడు సంగీత ప్రపంచంలో మునిగిపోతానని చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఏడుపు కూడా బాగా పని చేస్తుందని..

ఐదు నిమిషాల్లో మనసులో ఉన్న బాధ మొత్తాన్ని బయటకు పంపించేస్తుందని.. ఆ వెంటనే తిరిగి పనిలో పడిపోతానని చెప్పుకొచ్చింది. ఇలా ఒత్తిడిలో ఉన్నప్పుడు తనేం చేస్తుందనే విషయాన్ని బయటపెట్టింది పూజాహెగ్డే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ.. అన్ని సినిమాలను ఒకేసారి మ్యానేజ్ చేయడం కోసం నిద్ర తగ్గించుకున్నట్లు తెలిపింది. తక్కువగా పడుకొని.. వీలైనంత ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తున్నానని.. ఇదంతా సినిమా మీద ప్రేమ అని తెలిపింది.

ప్రస్తుతం తను చేస్తోన్న పనిని పూర్తిగా ఆశ్వాదిస్తున్నానని.. అదే తనకు ఉత్సాహాన్నిస్తుందని.. ఎంత పని చేస్తే అంత ఆనందం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.