ఆర్టీసీ క్రాస్ రోడ్ బన్నీ నెంబర్ వన్ రికార్డ్

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి పాన్ ఇండియా మూవీ మొదటి రోజు భారీ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలో కూడా పుష్ప ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే ఒక్కో చోట ఒక్కో విధమైన రికార్డును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ముత్తం కూడా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇక పుష్ప సినిమా నైజాంలో కూడా భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడం విశేషం. ఇక ఎక్కువగా సినిమా బిజినెస్ జరిగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా అల్లు అర్జున్ ఒక రికార్డును క్రియేట్ చేశాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా ఆల్ టైం టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సహజంగానే, పుష్ప చాలా సెంటర్లలో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పింది.

RTC X రోడ్స్‌లో 41,31,445 గ్రాస్ ను అందుకొని మొదటి రోజు టాప్ గ్రాసర్‌లలో నంబర్ స్లాట్‌ను ఆక్రమించింది. RTC X రోడ్స్‌లో టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి ఐదు చిత్రాలలో సరిలేరు నీకెవ్వరు 37,27,029 రెండవ స్థానంలో నిలువగా ఆ తరువాత బాహుబలి 2- 36,09,236, సాహో – 34,29,293 అజ్ఞాతవాసి – 28,96,772 ఉన్నాయి. బలమైన ఏరియాల్లో బన్నీ మరోసారి తన మార్కెట్ ను మరింత పెంచుకున్నట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ గా 60కోట్ల గ్రాస్ ను రాబట్టిన పుష్పకు శనివారం, ఆదివారం కూడా చాలా కీలకం కానున్నాయి. మరి ఆ రోజు ఏ స్థాయిలో వసూళ్లు అందుతాయో చూడాలి. ఇక పుష్ప సినిమా హిందీలో మొదటిరోజు మూడు కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించడం విశేషం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus