Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Reviews » Deepavali Review in Telugu: దీపావళి సినిమా రివ్యూ & రేటింగ్!

Deepavali Review in Telugu: దీపావళి సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 11, 2023 / 08:51 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Deepavali Review in Telugu: దీపావళి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పూ రాము (Hero)
  • NA (Heroine)
  • కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు (Cast)
  • రా వెంకట్ (Director)
  • స్రవంతి రవికిశోర్ (Producer)
  • థీసన్ (Music)
  • ఎం. జయప్రకాశ్ (Cinematography)
  • Release Date : నవంబర్ 11, 2023
  • శ్రీ స్రవంతి మూవీస్ (Banner)

దీపావళి సందర్భంగా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. డబ్బింగ్ సినిమాలు అలాగే కొన్ని చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘జపాన్’ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ఈ రెండూ డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ కాస్త క్రేజ్ ఉన్న సినిమాలుగా పేర్కొనాలి. అయితే ఆ రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అయితే రెండూ డిజప్పాయింట్ చేశాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..టాలీవుడ్ అగ్ర నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మొదటిసారి తమిళంలో ‘కిడ’ అనే చిత్రాన్ని నిర్మించారు. అదే చిత్రాన్ని తెలుగులో ‘దీపావళి’ పేరుతో రిలీజ్ చేశారు. కేవలం ‘స్రవంతి’ రవి కిషోర్ బ్రాండ్ పై వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ: టైటిల్ కి తగ్గట్టే ఇది దీపావళి పండుగ టైంలో జరిగే కథ. ఓ పల్లెటూరు. అక్కడ ఓ పేద రైతు శీనయ్య (పూ రామ్). తన కొడుకు, కోడలు చనిపోవడంతో తన మనవడు గణేష్(దీపన్ వైరుమండి) ని ప్రాణంగా పెంచుతాడు. అయితే గణేష్ ఒకరోజు దీపావళి పండుగ సందర్భంగా కొత్త బట్టలు వేసుకుని, టపాసులు కాల్చుకోవాలి అని ఆశపడతాడు. మనవడి కోరిక తీర్చాలని శీనయ్య కూడా తాపత్రయపడతాడు. కానీ అతని వద్ద డబ్బు ఉండదు.

తెలిసిన వాళ్ళని అప్పు అడుగుతాడు. కానీ ఎవ్వరూ ఇవ్వకపోగా ‘మీ పేద బ్రతుకులకి పండుగలు వంటివి ఎందుకు?’ అంటూ విమర్శిస్తారు. అయినా శీనయ్య తగ్గడు. తన వద్ద ఉన్న మేకని అమ్మేసి తన మనవడి కోరిక తీర్చాలి అనుకుంటాడు. కానీ అతని మనవడికి ఆ మేక అంటే ప్రాణం.దీపావళి పండుగకి నాకు కొత్త బట్టలు వంటివి వద్దు.. ఆ మేకని మాత్రం అమ్మొద్దు అని తన తాతని బ్రతిమిలాడతాడు. మరోపక్క మాంసం దుకాణంలో పనిచేసే వీరా స్వామి తాగుడుకి బానిస కావడం వల్ల పనికి లేట్ గా వెళ్తూ ఉండటంతో పని కోల్పోతాడు.

ఈ క్రమంలో సొంతంగా మటన్ కొట్టు పెట్టుకుని ఎదగాలని ప్రయత్నాలు మొదలు పెడతలడు. మరోపక్క అతని కొడుకు మేనత్త కూతురితో లేచిపోవాలి అని ప్రయత్నం చేస్తాడు. మరోపక్క నలుగురు దొంగలు శీనయ్య మేకని దొంగిలించాలి అనుకొంటారు. ఫైనల్ గా వీళ్ల కలయిక ఎలా జరిగింది. వీరి సమస్యలు ఎలా తీరాయి అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న ఒక్క నటుడు కూడా కనిపించడు. అయినా ప్రతి ఒక్కరూ పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పాలి. ప్రతి ఒక్క పాత్రతో అందరూ బాగా కనెక్ట్ అవుతారు. తాతగా పూ రామ్, మనవడిగా దీపన్, వీరస్వామిగా కాళీ వెంకట్ .. లు హైలెట్ అని చెప్పాలి.మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో ఫీమేల్ ఆర్టిస్టులకి స్పేస్ తక్కువ. అయినప్పటికీ వారి పాత్రలతోనే ఒక చక్కని ముగింపు ఇచ్చారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాని కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఒక పండుగ అనేది పేద కుటుంబాలకు ఎంత భారంగా ఉంటుంది. పండుగ టైమ్ కి డబ్బులు సమకూర్చుకోవడానికి వారు ఎంత కష్ట పెడతారు అనేది ఈ సినిమా లైన్. దీనిని దీపావళి పండుగ నేపథ్యంలో చెప్పాలని దర్శకుడు అనుకున్నాడు. ఎక్కువమంది జనాలు దీపావళి పండుగ టైమ్ లో టపాసులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు.

కాబట్టి పాయింట్ మంచిదే. కానీ సినిమా లిబర్టీస్ తీసుకోకుండా తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. ఈ విషయంలోనే దర్శకుడు తడబడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విషయంలో ఎక్కువగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ బాగానే ఉంది. క్లైమాక్స్ లో కొన్ని లాజిక్స్ మిస్ అయినా.. ఎండింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఓకే అని చెప్పాలి.

విశ్లేషణ: ఓవరాల్ గా ఈ ‘దీపావళి’ (Deepavali)  మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. మరి పోటీలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేం.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepavali
  • #Kaali Venkat
  • #Poo Ramu
  • #Ra Venkat

Reviews

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

15 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

17 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

18 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

1 day ago

latest news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

21 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

22 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

22 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

1 day ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version