దర్శకుడు సుకుమార్ (Sukumar) సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి స్పెషల్ గా ఉంటాయి. మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి కూడా. ‘పుష్ప’ లో (Pushpa) సమంతతో (Samantha) చేసిన ‘ఊ అంటావా ఉఊ’ అంటావా అనేది ఆడియన్స్ కి వెంటనే నచ్చేసింది. దీంతో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లోని ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదట ఈ పాటకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అది ఎందుకు అనే విషయంపై ఇటీవల సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) చెప్పుకొచ్చాడు.
Devi Sri Prasad
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మాట్లాడుతూ.. ‘ఊ అంటావా ఉఊ అంటావా’ పాటతో పోల్చి ‘కిస్సిక్’ ని తక్కువ చేస్తారని నేను ముందుగానే అనుకున్నాను. నేను వందలకొద్దీ రొమాంటిక్ సాంగ్స్ చేశాను. దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తుంది. కానీ ఐటెం సాంగ్స్ విషయంలో అలా ఉండదు. కొత్త ఐటెం సాంగ్ ని పాత ఐటెం సాంగ్ తో కంపేర్ చేసి చూస్తారు. అందులోనూ రెండు భాగాలుగా రూపొందే ఫ్రాంచైజీ మూవీస్లో మరీను. ‘కిసిక్’ అనే ఐటెం సాంగ్ కథకి లింక్ ఉంటుంది.
పైగా ఇందులో అమ్మాయి ఫోటో గురించి కాన్సెప్ట్ వైజ్ చెప్పడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు ట్యూన్ డిజైన్ చేసుకోవడం జరిగింది. అది జనాలకి ఎక్కడానికి టైం పడుతుంది అని ముందుగానే అనుకున్నాను. కానీ ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అనేది ఆడియన్స్ కి వెంటనే ఎక్కేసింది. అందులో అబ్బాయిల పై సెటైర్లు కూడా ఉంటాయి. అది ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అవ్వడానికి అదొక కారణం.అలాగే మనం ఆల్రెడీ వాడిన ట్యూన్స్ కనుక కొత్త పాటలకి అప్లై చేస్తే.. వెంటనే ఎక్కేస్తాయి” అంటూ చెప్పుకొచ్చాడు.