మనుషులు ఘోరాలు చేయడానికి భయపడే ప్రధాన కారణాల్లో నరకం ఒకటి. అక్కడ విధించే శిక్షలు గురించి తెలుసుకుంటే చీమను చంపడానికి సైతం భయపడతారు. అబద్దం చెప్పాలన్నా నోరు రాదు. దేవుడు, దెయ్యాలు లేవని చెప్పే నాస్తికులకు కూడా చమటలు పట్టాల్సిందే. అన్ని మత గ్రంధాల్లో మంచి చేసినవారు స్వర్గానికి వెళుతారు, చెడు చేసిన వారు నరకానికి వెళుతారని స్పష్టంగా రాయబడి ఉంది.
గరుడ పురాణం వంటి కొన్ని పురాతన పుస్తకాల్లో పాపాత్ములు అనుభవించే శిక్షలు వివరంగా రాశారు. వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధకుల మాటలను సేకరించి “నరకంలో విధించే శిక్షలు” అనే వీడియో ద్వారా రహస్యవాణి మీకు అందిస్తోంది. భూమి మీద పుట్టి పాపాలు చేసిన వారు తప్పించుకోలేని వెలుగు లేని లోకం.. నరకం గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి.