అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్లు, దర్శకుడు అట్లీ రూ.100 కోట్లు పారితోషికంగా.. అందుకుంటున్నట్టు టాక్ నడిచింది. దీపికా పదుకోనె హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆమె పారితోషికం దాదాపు రూ.20 కోట్లనే టాక్ కూడా నడుస్తోంది.
మరోపక్క మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కపూర్ కూడా ఓ హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఆల్రెడీ ముంబైలో ఓ కీలక షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. దీని కోసం రూ.6 కోట్ల బడ్జెట్ తో ఓ సెట్ వేసినట్లు వినికిడి. ఇదిలా ఉండగా… అట్లీ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు? అనే చర్చ కూడా నడుస్తోంది.
వాస్తవానికి ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) … త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల అది హోల్డ్ లో పడింది. మరోపక్క సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ (Allu Arjun) ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అల్లు అర్జున్ 23వ సినిమాగా ఆ ప్రాజెక్టు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. టి.సిరీస్ సంస్థ ఆ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నట్లు.. దిల్ రాజు ఆ ప్రాజెక్టుని నిర్మించనున్నట్టు కూడా ప్రచారం జరిగింది.
తాజాగా దీనిపై దిల్ రాజు (Dil Raju) క్లారిటీ ఇచ్చారు. ‘మా బ్యానర్లో అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘రవణం’ అనే సినిమా ఉంటుంది. అయితే దానికి ఇంకా టైం పడుతుంది’ అంటూ దిల్ రాజు ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.