నిర్మాతల్లో భవిష్యత్ దార్శనీకుల్లో దిల్ రాజు ఒకరు. ఆయన నిర్మాణ సంస్థను హ్యాండిల్ చేస్తున్న తీరు, నిర్మిస్తున్న చిత్రాలు, వాటి పబ్లిసిటీ విషయంలో పాటించే పద్ధతులు, రిలీజ్ తర్వాత థియేటర్లు నింపడానికి చేసే ప్రయత్నాలు చూసి నవతరం నిర్మాతలు మాత్రమే కాదు భవిష్యత్ లో ఇండస్ట్రీకి రావాలనుకొనే నిర్మాతలు కూడా నేర్చుకోవాలి. దిల్ రాజు ఒక రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడంటే.. సదరు సినిమా ఒరిజినల్ యూట్యూబ్ లో కానీ, ఎలాంటి డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ ఆఖరికి పైరసీ సైట్లలోనూ లేకుండా జాగ్రత్తపడతాడు. కానీ.. అదే దిల్ రాజు తనకు నిర్మాతగా పూర్వ వైభవం తెచ్చిపెట్టడంతోపాటు బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టిన “ఎఫ్ 2″ను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
హిందీలో బోణీకపూర్ తో కలిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్న దిల్ రాజు.. ప్రస్తుతం ఆ ప్రీప్రొడక్షన్ పనులు అక్కడి ఓ సంస్థకి అప్పజెప్పాడు కూడా. అయితే.. ఈలోపు “ఎఫ్ 2” చిత్రాన్ని హిందీ భాషలోకి డబ్బింగ్ కూడా చేయించేశాడు దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందే సినిమాలన్నీ యూట్యూబ్ లో హిందీ వెర్షన్ ఎవైలబుల్ ఉండడం కామన్. కానీ.. హిందీలో రీమేక్ అవ్వబోయే చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేయించడం, అది కూడా అక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే ప్రస్తుతం చర్చయాంశం అయ్యింది.