దిల్ రాజు (Dil Raju) ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరో అశీష్ (Ashish Reddy), ఇప్పటి వరకు చేసిన యూత్ బేస్డ్ సినిమాలతో ఓ ఇమేజ్ ఏర్పరచుకున్నా, ఆ మోడ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న కొత్త సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతుంది. ఈసారి కథలో మాస్ ఎమోషన్, రీజనల్ నేటివిటీ, ఫోక్ టచ్ అన్నీ కలిపి, పూర్తిగా విభిన్న మూడ్‌లో అశీష్ కనిపించనున్నాడు. ఇప్పటి వరకు చూసిన అతడి స్క్రీన్ ఇమేజ్‌తో పోల్చితే ఇది కంప్లీట్ టర్నింగ్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన రంగస్థలం (Rangasthalam) స్టైల్‌లో ఉండబోతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే కథ మాత్రం కొత్తదే. బతుకమ్మ, బోనాలు లాంటి పండుగల నేపథ్యం, గ్రామాల సంస్కృతి, స్థానిక ఆచారాలు స్క్రీన్ మీద నిలిచేలా డిజైన్ చేశారు. ఇది ఒక కమర్షియల్ విలేజ్ డ్రామా కాన్సెప్ట్ అయినా, అందులో ఉన్న ఎమోషనల్ న్యాన్స్‌లే సినిమాకు హార్ట్ అఫ్ ద సబ్జెక్ట్ అవుతాయని వినిపిస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించబోయే డైరెక్టర్ కు ఇదే మొదటి సినిమా కావడంతో, ఆయన విజన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఫస్ట్ గ్లింప్స్ కోసం ఓ ప్రోమో షూట్ నిర్వహిస్తున్నారు. ఇందులో అశీష్ లుక్, మూవీ టోన్, నేపథ్యం వంటి అంశాలను హైలైట్ చేయనున్నారని సమాచారం. ఇదంతా చూస్తుంటే, ఆయనపై ఈసారి కాస్ట్ మరియు కంటెంట్ పరంగా భారీ బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథకు తగినట్టుగా గ్రాండుగా సెట్‌లను రెడీ చేస్తున్నారు. దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
అశీష్ గత సినిమాల తీరునే కాకుండా, పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్ చూపించే విధంగా ఈ సినిమాను మలచాలని మేకర్స్ భావిస్తున్నారు. మాస్ హంగామా, తెలంగాణ నేటివిటీ కలిసేలా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. ఈ కథ, ఈ ప్యాకేజింగ్‌తో అశీష్ కెరీర్‌కు కొత్త దారిని చూపించగలిగితే, ఆయన కోసం ట్రాక్ మళ్లీ సెట్ అవుతుంది. ఒక్కసారి ఈ సినిమాతో హిట్ కొడితే, మాస్ హీరోగా స్టెప్పుపైకి వెళ్లే అవకాశముంది. మరి అతనికి ఎలాంటి విజయం అందుతుందో చూడాలి.