జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం బలగం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతో అద్భుతంగా చూపిస్తూ తెరికెక్కిన ఈ సినిమా గత నెల మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఇలా ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు మంచి లాభాలను కూడా అందుకున్నారు.
ఇకపోతే తెలంగాణలో ప్రతి మారుమూల గ్రామంపై కూడా బలగం సినిమా ప్రభావం పడిందని చెప్పాలి. ఏకంగా గ్రామాలలో దండోరా వేసి ఉచితంగా ఈ సినిమాను ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది అలాగే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాని ఇలా గ్రామాలలో ఉచితంగా ప్రదర్శన చేయటం వల్ల తమకు భారీ నష్టాలు ఏర్పడతాయని దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారని వార్తలు వైరల్ అయ్యాయి.
ఇలా దిల్ రాజు (Dilraju) పోలీసులకు ఫిర్యాదు చేశారనీ తెలియడంతో ఇది కాస్త వివాదంగా మారింది. అయితే ఈ విషయంపై దిల్ రాజు మరోసారి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. బలగం సినిమాని గ్రామాలలో ప్రదర్శించడానికి తాను ఏమాత్రం అడ్డుపడలేదని తెలిపారు. సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడమే మా లక్ష్యం కనుక ఈ సినిమాని ఎంత ఎక్కువ మంది చూస్తే మాకు అంతే మంచిది.
ఈ సినిమా చూసిన తర్వాత సొంత అన్నదమ్ములు తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి వివాదాలు కూడా తొలగిపోయి కలుసుకున్నారని తెలియడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మా సినిమా ద్వారా తెగిపోయిన బంధుత్వాలు తిరిగి కలుసుకుంటున్నాయి అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అంటూ తన గురించి వస్తున్నటువంటి వార్తలపై క్లారిటీ ఇచ్చారు.